క‌ల్యాణ్‌దేవ్ స‌ర‌స‌న `సూప‌ర్‌మ‌చ్చి` ర‌చితా రామ్

`సూప‌ర్‌మ‌చ్చి`… ఇటీవ‌ల ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేస్తూ.. ఫ‌స్ట్ లుక్‌ విడుద‌ల చేశారు. చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. క‌ల్యాణ్‌దేవ్‌ హీరో గా రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై రిజ్వాన్ నిర్మాత‌గా పులివాసు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో క‌ల్యాణ్‌దేవ్ స‌ర‌స‌న క‌న్న‌డ బ్యూటీ ర‌చితా రామ్ హీరోయిన్‌గా ఎన్నికయింది . కొత్త షెడ్యూల్‌ న‌వంబ‌ర్ 22 నుండి ప్రారంభించ‌బోతున్నారు. మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ త‌మ‌న్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.
 
నరేశ్ వి.కె, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, ప్ర‌గ‌తి, అజ‌య్‌, మ‌హేశ్‌, ష‌రీఫ్‌, స‌త్య త‌దిత‌రులు న‌టీన‌టులు. పాట‌లు: కెకె, కో ప్రొడ్యూస‌ర్‌: ఖుషి, ఎడిటింగ్‌: మార్తాండ్ కె.వెంక‌టేశ్‌, ఆర్ట్‌: బ్ర‌హ్మ క‌డ‌లి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: మ‌నోజ్ మావెళ్ల‌