ఒకేసారి నేనలాంటి రెండు సినిమాలు చేస్తున్నా!

కియరా అద్వాని ప్రస్తుతం బాలీవుడ్‌లో రెండు హారర్‌ కామెడీ చిత్రాల్లో నటిస్తోంది. అందులో ఒకటి అక్షయ్ కుమార్‌ హీరోగా రూపొందుతోన్న ‘లక్ష్మీబాంబ్‌’, మరొకటి కార్తికేయన్‌ కదానాయకుడిగా చేస్తున్న ‘భూల్‌ భులైయా2’. ఈ రెండు చిత్రాలూ హారర్‌ కామెడీ నేపథ్యంలో రూపొందుతున్నవే. మరో రెండు నెలల్లో ఈ చిత్రాల షూటింగ్‌ పూర్తి కానున్న నేపథ్యంలో కియరా మాట్లాడుతూ …. ‘హారర్‌ కామెడీ నేపథ్యంలో చేసే చిత్రాల్లో నటిస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. మొదటి ‘లక్ష్మీబాంబ్‌’ అనుకున్నా, తర్వాత ‘భూల్‌ భులైయా 2′ కూడా చేస్తున్నా. ఈ రెండు చాలా విభిన్నమైనవి. అందువల్లే నేను చాలా ఎగ్జయిట్‌ అవుతున్నా’ అని తెలిపింది.
 
“లక్ష్మీబాంబ్‌” ఈ అద్భుతమైన సినిమా కోసం అన్ని విధాల శ్రమిస్తున్నాం. ఇదొక సరికొత్త ఎంటర్‌టైనర్‌. దీనిపై భారీ అంచనాలే ఏర్పడతాయి. నేను అక్షయ్ కి పెద్ద అభిమానిని.
“భూల్‌ భులైయా 2” నా మొదటి హారర్‌ కామెడీ ఫిల్మ్‌. ఇటువంటి చిత్రాలు ఇప్పటి వరకూ చేయలేదు. ఈ సినిమా పక్కాగా చేస్తున్నాం. డైరెక్టర్‌ అనీస్‌, కార్తికేయన్‌తో కలసి పనిచేయడం నాకెంతో సంతోషంగా ఉంది. ఇదొక హిలేరియస్‌ సినిమా” అని చెప్పింది కియరా.
‘భూల్‌ భులైయా 2’ చిత్రానికి అనీజ్‌ బజ్మీ దర్శకత్వం వహిస్తున్నారు. భూషణ్‌ కుమార్‌ నిర్మాత. 2007లో వచ్చిన ‘భూల్‌ భులైయా’కు సీక్వెల్‌గా రూపొందిస్తున్నారు. మొదటి భాగానికి ప్రియదర్శన్‌ దర్శకత్వం వహిస్తే..అక్షయ్ హీరోగా నటించారు. వచ్చే ఏడాది జులై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘లక్ష్మీబాంబ్‌’ సినిమాకు రాఘవ లారెన్స్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ సినిమా ‘ముని 2 : కాంచన’కి రీమేక్‌గా ఈ సినిమాను హిందీలో తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది మే 22న విడుదల కానున్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్‌, కియరా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
 
మరోసారి బోల్డ్‌ పాత్రలో
‘లస్ట్‌ స్టోరీస్‌’ అనే వెబ్‌ సిరీస్‌లో బోల్డ్‌ క్యారెక్టర్‌తో మంత్రముగ్ధుల్ని చేసిన కైరా అద్వానీ మరోసారి బోల్డ్‌ పాత్రలో కనిపిస్తోంది . తాజాగా ‘ఇందూ కి జవానీ’ చిత్రంలో ఆమె పాత్ర చాలా బోల్డ్‌గా ఉంటుందట. నేటి అమ్మాయిలను ప్రతిబింబించేలా.. ట్రెండీగా.. ఆకర్షించేలా.. కనిపించనుంది . ముఖ్యంగా ఆన్‌లైన్‌ డేటింగ్‌, బ్రేకప్‌లను ప్రతిబింబిస్తుందని కైరా చెబుతోంది…
‘ఇందులో ఘాజియాబాద్‌కి చెందిన ఇందూ అనే అమ్మాయిగా కనిపిస్తాను. నా పాత్ర నేటి అమ్మాయిల జీవన శైలిని ప్రతిబింబిస్తుంది. నాకు బాగా నచ్చింది. నా పాత్ర చుట్టూ సినిమా నడుస్తుంది. ఇది చాలా బలమైన పాత్ర. దీనికోసం ప్రత్యేకంగా ప్రిపేర్‌ అవుతున్నాను. ఘాజియాబాద్‌లోని అమ్మాయిలు, వారి వ్యవహారశైలిని గమనిస్తున్నా.ఇలాంటి పాత్రని గతంలో చేయలేదు. అందుకే జాగ్రత్తలు తీసుకుంటున్నా’ అని తెలిపింది. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ లక్నోలో జరుగుతుంది. అక్కడ కైరాపై కొన్ని బోల్డ్‌ సీన్స్‌ చిత్రీకరిస్తున్నారట. అబీర్‌ సేన్‌గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆదిత్య సీల్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.
ఇక ఇటీవల ‘కబీర్‌ సింగ్‌’తో భారీ విజయాన్ని అందుకున్న కైరా ప్రస్తుతం ‘గుడ్‌న్యూస్‌’, ‘లక్ష్మీబాంబ్‌’, ‘షేర్షా’, ‘భూల్‌ భులైయా 2’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.