మహేష్ కత్తి ‘ఎగసే తారాజువ్వలు’ ప్రీ రిలీజ్ వేడుక !

0
229
హెచ్ వై ప్రొడక్షన్స్ పై శ్రీమతి వాణి ఇరగం ప్రెజెంట్స్ ‘ఎగసే తారాజువ్వలు’ చిత్రాన్ని నిర్మాత నాగ మల్లా రెడ్డి నిర్మించగా మహేష్ కత్తి దర్శకత్వం వహించారు. త్వరలో విడుదలకు సిద్దంగా ఉన్న నేపథ్యం లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు చిత్ర యూనిట్. తారాజువ్వలు చిత్ర వేడుకకు  ముఖ్య అతిథి గా  విచ్చేసిన  విజయ్ దేవరకొండ బిగ్ సిడి ని,  చాలాకి న్యూస్ వెబ్ సైట్ ను లాంచ్ చేయగా  ఈ చిత్ర ఫస్ట్ సాంగ్ ను అతిథులు శేఖర్ కమ్ముల, తమ్మారెడ్డి భరద్వాజ్, చిన్ని కృష్ణ లు కలసి మధురా ఆడియో ద్వారా విడుదల గావించారు, ఈ చిత్ర  ట్రైలర్  గీతా కృష్ణ, మోహన్ కృష్ణ ఇంద్రగంటి, శ్రీనివాస్ రాజ్, మధురా శ్రీధర్  విడుదల చేసారు.
అనంతరం శేఖర్ కమ్ముల మాట్లాడుతూ- ఇటీవల కాలంలో స్కూళ్లకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి సున్నితమైన  టాపిక్ ను అటెంప్ట్ చేసిన దర్శక నిర్మాతలకు నా అభినందనలు అని అన్నారు. కమర్షియల్ సినిమాలు చేసి డబ్బు సంపాందించుకోవాలని చూసే వాళ్ళున్న ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ పై కాన్సెప్ట్ ను తీసుకొని సమాజానికి ఉపయోగపడేలా సినిమా చేసిన కత్తి మహేష్ ను, నిర్మాత మల్లారెడ్డి ను అభినందించకుండా ఉండలేం అని అన్నారు.
ముఖ్య అతిథి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ- నేను ఇప్పుడు ఈ ప్లేసులో ఉన్నాను అంటే బాగా చదుకోవడమే కారణం. మార్కులు ఇంపార్టెంట్ కాదు నేర్చుకోవడం ఇంపార్టెంట్. ఏ సమస్యలు వచ్చినా ఎవరికివారే ధైర్యంగా  పరిష్కరించుకునేలా పిల్లలు ఎదగాలని కోరుతున్నా అని చెబుతూ… ఈ చిత్రం లో నటించిన చైల్డ్ అర్టిస్ట్స్ కు మేసెజ్ తో కూడిన కార్డ్స్ ను, పెన్స్ ను అందించారు.
దర్శకుడు మహేష్ కత్తి మాట్లాడుతూ- ‘చదువంటే బట్టీ పట్టడం కాదు, జీవితాన్ని వడేసి పట్టడం’ అనే అంశాన్ని ఎంటర్టైనింగ్ గా, సెన్సిటివ్ గా ఈ చిత్రంలో చెప్పడం జరిగింది. సినిమా చూసిన ఏ ఒక్కరినీ నిరుత్సాహ పరచదు అని మాత్రం నమ్మకంగా చెప్పగలను అని అన్నారు. చాలా కష్టపడి సినిమా చేసాము. ఈ చిత్రానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు అని తెలిపారు నిర్మాత నాగ మల్లా రెడ్డి.
ఈ కార్యక్రమానికి అవసరాల శ్రీనివాస్, క్రాంతి మాధవ్,  సంగీత దర్శకుడు రఘు కుంచె, లక్ష్మీ భూపాల్, సతీష్, అజయ్ ఘోష్, మరియు ఈ చిత్ర యూనిట్,  పాల్గొని తమ అభిప్రాయాలను, అభినందనలు తెలియచేసారు.
యశ్వంత్, హాసిని, సౌమ్య వేణుగోపాల్, అజయ్ గోష్, లోహిత్, స్వప్న , అప్పాజీ అంబారిష్ఠ తదితరులు నటించిన ఈ చిత్రానికి దర్శకుడు: మహేష్ కత్తి, నిర్మాత: నాగ మల్లారెడ్డి, కో డైరెక్టర్: కార్తిక్ మెడికొండ, కెమెరా: వినోద్, రాజేంద్ర, మ్యూజిక్: గంటశాల విశ్వనాధ్,  కాస్ట్యూమ్స్: నిహారిక, లిరిక్స్: భాస్కరభట్ల, శ్రేష్ఠ, ఎడిటర్: రవితేజ, రఘు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here