నవంబర్‌ 10న విశాల్‌ ‘డిటెక్టివ్‌’

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడుగా విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సమర్పణలో మిస్కిన్‌ దర్శకత్వంలో జి.హరి నిర్మించిన సస్పెన్స్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘డిటెక్టివ్‌’. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి నవంబర్‌ 10న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత జి.హరి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత జి.హరి మాట్లాడుతూ ”మొదటి వారంలోనే 30 కోట్ల రూపాయలు కలెక్ట్‌ చేసి విశాల్‌ కెరీర్‌లోనే మొదటివారం హయ్యస్ట్‌ కలెక్షన్‌ సాధించిన చిత్రంగా ‘తుప్పరివాలన్‌’ రికార్డు సృష్టించింది. తెలుగులో ‘డిటెక్టివ్‌’గా విడుదలవుతున్న ఈ చిత్రం తప్పకుండా బిగ్గెస్ట్‌ హిట్‌ అవుతుందన్న నమ్మకం వుంది. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. నవంబర్‌ 10న చాలా గ్రాండ్‌గా ‘డిటెక్టివ్‌’ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం” అన్నారు.
మాస్‌ హీరో విశాల్‌, అను ఇమ్మానుయేల్‌, ఆండ్రియా, ప్రసన్న, కె.భాగ్యరాజ్‌, సిమ్రాన్‌, జాన్‌ విజయ్‌, అభిషేక్‌ శంకర్‌, జయప్రకాష్‌ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: అరోల్‌ కొరెల్లి, సినిమాటోగ్రఫీ: కార్తీక్‌ వెంకట్రామన్‌, మాటలు: రాజేష్‌ ఎ.మూర్తి, నిర్మాత: జి.హరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మిస్కిన్‌.