‘పలాస 1978’ లిరికల్ వీడియో ఎస్పీ విడుదల

రియలిస్టిక్ కథలకు టైం పీరియడ్ కూడా తోడైతే ఆ కథలు విపరీతంగా
ఆకట్టుకుంటాయి. అలాంటి కొన్ని ఆసక్తికరమైన అంశాల చుట్టూ అల్లుకున్న
కథాంశంతో వస్తోన్న చిత్రం ‘పలాస 1978’. 1978 ప్రాంతంలో పలాసలో జరిగిన
కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో అల్లుకున్న కథ ఇది. ఇప్పటికే ఈ చిత్ర
ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది. చిత్ర కథాంశం గురించి
తెలిసిన చాలామంది ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇక రఘు కుంచే సంగీతం
అందిస్తోన్న ఈ చిత్రం నుంచి ఓ పాటను విడుదల చేశారు. లెజెండరీ సింగర్
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లేటెస్ట్ సెన్సేషన్ పల్లెకోయి బేబీ కలిసి ఈ పాటను
పాడటం విశేషం. బాలు ఓ ముప్ఫైయేళ్లు వెనక్కి వెళ్లి తన గాత్రాన్ని
వినిపిస్తే బేబీ గాత్రం పాటకు ఓ ఫ్రెష్ నెస్ ను తీసుకువచ్చింది.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి పాడాలనుకోవడం ఎవరికైనా ఓ కల. ఆ కలను
గాయనిగా కెరీర్ ఆరంభించిన తొలినాళ్లలోనే అందుకున్న పల్లెకోయిల బేబీ ఏకంగా
ఆయనతో కలిసి డ్యూయొట్ ఆలపించేయడం నిజంగా విశేషమే. అంత పెద్ద లెజెండ్ తో
పాడుతున్నా.. ఎక్కడా తొణక్కుండా తన సహజమైన గాత్రంతో ఆకట్టుకుంది.
లక్ష్మీ భూపాల ఈ పాటను రాశారు.
దర్శకుడు కరుణ కుమార్ కు ఇది తొలి చిత్రం. కానీ ఆయన రచయితగా
సాహిత్యలోకంలో అందరికీ తెలిసిన వ్యక్తి. ఆ రకంగా ఇది కథగా ఎంతో బలంగా
ఉండబోతోందని కూడా అర్థం చేసుకోవచ్చు.
సుధ మీడియా పతాకంపై రూపొందిన ఈ చిత్రంలో రక్షిత్, నక్షత్ర జంటగా
నటించారు. రఘు కుంచే తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర
పాత్రల్లో నటిస్తున్నారు.
తమ్మారెడ్డి భరద్వాజ సమర్పిస్తోన్న ఈ చిత్రానికి పాటలు : భాస్కర భట్ల,
సుద్దాల అశోక్ తేజ, లక్ష్మీ భూపాల, బండి సత్యం ఎడిటర్ : కోటగిరి
వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ : అరుల్ విన్సెంట్, సంగీతం : రఘు కుంచే ,
నిర్మాత : ధ్యాన్ అట్లూరి, రచన, దర్శకత్వం: కరుణ కుమార్