పారితోషికంలో కొంత వెనక్కి ఇచ్చేయాలని హెచ్చరిస్తున్నా!

Producer warting to Trisha
Producer warting to Trisha

‘‘లేడీ ఓరియంటెడ్‌ సినిమా తీసినప్పుడు దానికి కావల్సినంత ప్రచారం కల్పించాల్సిన బాధ్యత ఆ హీరోయిన్‌దే’’ అన్నారు తమిళ నిర్మాత టి. శివ. స్టార్‌ హీరోలతో తీసే సినిమాల ప్రచార కార్యక్రమాలకు హీరోయిన్లు రాకపోయినా ఫర్వాలేదు. హీరోని బట్టి ప్రమోషన్‌ వచ్చేస్తుంది. అయితే కథానాయికను నమ్మి లేడీ ఓరియంటెడ్‌ సినిమా తీసినప్పుడు దానికి కావల్సినంత ప్రచారం కల్పించాల్సిన బాధ్యత ఆ హీరోయిన్‌దే’’ అన్నారు తమిళ నిర్మాత టి. శివ. త్రిష నటించిన తమిళ చిత్రం ‘పరమపద విళయాట్టు’కి సంబంధించిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆ కార్యక్రమానికి త్రిష హాజరు కాకపోవడంతో టి. శివ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

పారితోషికంలో కొంత భాగం వెనక్కి
నూతన దర్శకుడు తిరుజ్ఞానం దర్శకత్వంలో రూపొంది ఈ నెల 28న విడుదల కానున్నఈ సినిమా ప్రీ–రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న టి. శివ మాట్లాడుతూ –
‘‘ఈ సినిమా దర్శకుడు తిరుజ్ఞానం నా స్నేహితుడు. ఎంతో కష్టపడి తీశాడు. నేనింకా సినిమా చూడలేదు. కానీ రషెస్‌ చూసినవాళ్లందరూ బాగుందన్నారు. హీరోలు లేకుండా తను ఈ సినిమా చేశాడు. అందుకని ప్రమోషన్‌ చేయాల్సిన బాధ్యత హీరోయిన్‌ మీద ఉంది. కానీ రాలేదు. ఒకవేళ ఈ కార్యక్రమానికి రాకపోవడానికి ఆమెకు విలువైన కారణం ఏదైనా ఉండి ఉండొచ్చు. కానీ 28లోపు జరిగే ప్రమోషనల్‌ కార్యక్రమాలకు తను కచ్చితంగా రావాల్సిందే. లేకపోతే ఈ సినిమాకి తీసుకున్న పారితోషికంలో కొంత భాగం వెనక్కి ఇచ్చేయాలని నిర్మాతల సంఘం తరఫున హెచ్చరిస్తున్నా. ఇది ఇతర స్టార్స్‌కి కూడా కనువిప్పులా ఉంటుంది’’ అంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
అనుకున్నట్లే డుమ్మా కొట్టేసింది! 
దర్శక నిర్మాతలను ఇప్పుడు చాలా మంది టెన్షన్‌ పెట్టిస్తున్నారు. కొందరు షూటింగ్‌కు సరిగా రాక ..మరొకరు పూర్తి పారితోషం చెల్లిస్తేనే చిత్రాన్ని పూర్తిచేస్తానని బెదిరిస్తుంటారు. ఇక సంచలన నటి నయనతార అయితే చిత్రానికి సంబంధించిన ఎలాంటి ప్రమోషన్‌కు రాదు. ఇప్పుడు నటి త్రిష కూడా తాను నటించిన చిత్ర నిర్మాతను టెన్షన్‌కు గురిచేస్తున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. త్రిష తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంది. కాగా ఈ అమ్మడు హీరోయిన్‌ సెంట్రిక్‌ పాత్రలో నటించిన చిత్రాల్లో ఒకటి ‘పరమపదం విళైయాట్టు’. చాలా కష్టాలు పడి నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. దీంతో చిత్ర వర్గాలు ప్రమోషన్‌లో భాగంగా మీడియా సమావేశానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో పాల్గొనాల్సిందిగా నటి త్రిషకు ఆహ్వానం పంపారు. అందుకు తనూ ఓకే చెప్పిందట.
 
అయితే మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ‘పొన్నియన్‌ సెల్వన్‌’ చిత్రంలోనూ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మహారాణిగా నటించనున్నట్లు తెలిసింది. కాగా ‘పరమపదం విళైయాట్టు’ చిత్ర మీడియా సమావేశం రోజునే దర్శకుడు మణిరత్నం తన చిత్రంలోని త్రిష గెటప్‌ కోసం ఫొటో సెషన్‌ను ఏర్పాటు చేశారట. దీంతో అందులో పాల్గొననున్న త్రిష తన చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమంలో పాల్గొంటుందా?.. అన్న భయం ‘పరమపదం విళైయాట్టు’ చిత్ర నిర్మాత కు పట్టుకుందట. అయితే త్రిష మాత్రం తాను కచ్చితంగా మీడియా సమావేశంలో పాల్గొంటానని, సమావేశాన్ని రద్దు చేయవద్దని ఆ నిర్మాతకు మాట ఇచ్చిందట. అయినా ఆమె డుమ్మా కొడుతుందేమోనన్న టెన్సన్‌లోనే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే అక్కడ ఫొటో షూట్‌ జరగనుంది మణిరత్నం చిత్రానికి, అదీ రాణి గెటప్‌కు. అందువల్ల త్రిష ‘పరమపదం విళైయాట్టు’ చిత్ర ప్రమోషన్‌కు డుమ్మా కొట్టే అవకాశం ఉంది.