వాస్తవాలను ఎప్పుడూ గుర్తుంచుకుంటా !

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌… దక్షిణాది లో ఓ వెలుగు వెలిగిన కథానాయిక. టాలీవుడ్‌లో అగ్రహీరోల సరసన నటించినా ఇక్కడ అవకాశాలు తగ్గడంతో ఇప్పుడు బాలీవుడ్‌లోకి వెళ్లింది. వాస్తవంగా 2014లోనే ‘యారియన్‌’ చిత్రంతో హిందీ చిత్రసీలోకి ప్రవేశించింది. కానీ తెలుగులోనే అవకాశాలు ఎక్కువగా రావడంతో ఇక్కడే ఎక్కువ చిత్రాలు చేసింది. ఇప్పుడు మళ్లీ బాలీవుడ్‌లో నటిస్తోంది. అజరు దేవగన్‌, టబు, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం ‘దేదే ప్యార్‌ దే’. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్‌ పనుల్లో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ….’బాలీవుడ్‌లో నాకింకా పేరు రావడం లేదన్న బాధ అయితే లేదు. నేను చిత్రసీమలోకి వచ్చి ఆరేళ్లు అవుతుంది. వాస్తవం చెప్పాలంటే నేను ఒక నటిని…. ‘పేరు రాలేదు… నన్ను గుర్తించలేదు’… అవేవీ నా మైండ్‌లోకి రావు. ఈ వాస్తవాలను నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటా. దక్షిణాది భాషలో కూడా చాలా సినిమాలు చేశాను. నటిగా నా పని నేను చేసుకుంటూ పోవడమే తప్ప మిగిలిన విషయాలు పట్టించుకోను” అని పేర్కొంది రకుల్‌.
 
ఈ రెండు సినిమాలు కీలకం
రకుల్‌ప్రీత్ సింగ్ తెలుగు, తమిళ్,హిందీలో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా కెరీర్‌ కొనసాగిస్తోంది. తెలుగులో నాగార్జున సరసన ‘మన్మథుడు 2’, తమిళంలో సూర్యతో ‘ఎన్‌జికె’, హిందీలో అజయ్ దేవగణ్ సరసన ‘దే దే ప్యార్ దే’ సినిమాల్లో రకుల్ నటిస్తోంది. ఇక ‘ఎన్‌జికె’, ‘దే దే ప్యార్ దే’ సినిమాల్లో ఈ ముద్దుగుమ్మ మెయిన్ హీరోయిన్ కాదు. ‘ఎన్‌జికె’లో సూర్య భార్య పాత్రలో సాయిపల్లవి నటిస్తే… ఓ ఆఫీసర్ పాత్రను రకుల్ పోషించింది. ఇక ‘దే దే ప్యార్ దే’ మూవీలో 50 ఏళ్ల హీరో అజయ్ దేవగన్ ప్రియురాలిగా ఈ బ్యూటీ నటిస్తోంది. ఈ రెండు సినిమాలు కొద్ది రోజుల వ్యవధిలోనే అంటే మే 17, మే 31 తేదీలలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ రెండు సినిమాలు రకుల్‌కు కీలకంగా మారాయి. ఈ చిత్రాలు విజయాలు సాధించాలని ఈ భామ కోరుకుంటోంది. ఇవి సక్సెస్ సాధిస్తే కోలీవుడ్, బాలీవుడ్‌లో రకుల్ నిలదొక్కుకుంటుంది. టాలీవుడ్ లో ఆమె నాగార్జునతో ‘మన్మధుడు 2’ లో చేస్తోంది.