త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ ప్ర‌శంస‌లందుకున్న’ గిఫ్ట్’ టీమ్

సాయి కుమార్ తోట ‘గిఫ్ట్’ షార్ట్ ఫిల్మ్…  రిషి పుల్లా,స‌మీర్ , జివి సందీప్ ,ప్ర‌త్యూష‌, ల‌హ‌రి , ఫ‌ణి కుమార్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా సాయి కుమార్ తోట రూపోందించిన షార్ట్ ఫిల్మ్ ‘గిఫ్ట్’ .ఆర్ స్టార్ఎంట‌ర్ టైన‌మెంట్స్ నిర్మించిన ఈ షార్ట్ ఫిల్మ్ స్రీనింగ్ హైద్రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్ లో జ‌రిగింది. ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ ,నిర్మాత రాజ్ కందుకూరి , న‌టుడు స‌మీర్ ‘గిఫ్ట్’ షార్ట్ ఫిల్మ్ ను ప్ర‌త్యేకంగా వీక్షించారు..
 
ద‌ర్శ‌క‌నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాట్లాడుతూ…ఓ ఫిచ‌ర్ ఫిల్మ్ కు సంబందించిన స్టోరీ లైన్ ను షార్ట్ ఫిల్మ్ గా తీసి అంద‌రిని మెప్పించార‌ని అన్నారు..ఇప్పుడు ఉన్న యువ‌త వింత పోక‌డ‌లకు పోతూ ల‌ఘ‌చిత్రాలు తీస్తుంటే..గిఫ్ట్ టీమ్ దానికి విరుద్దంగా ఓ మంచి షార్ట్ ఫిల్మ్ తీయ‌డం బాగా న‌చ్చింద‌ని అన్నారు..ఇందులో న‌టీన‌టులు,టెక్నిషియ‌న్స్ కొత్త‌వారైన బాగా చేశార‌ని అభినందించారు..
 
న‌టుడు స‌మీర్ మాట్లాడుతూ…గిఫ్ట్ షార్ట్ ఫిల్మ్ స్టోరీ న‌చ్చి దీనిలో బాగ‌మైనందుకు చాలా ఆనందంగా ఉంద‌న్నారు..అంతేకాదు త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ లాంటి పెద్ద‌మ‌నిషి వ‌చ్చి అంద‌రిని అభినందించ‌డం చాలా సంతోషంగా ఉంది అన్నారు..టీమ్ అంద‌రికి మంచి భ‌విష్య‌త్తు ఉంద‌ని తెలిపారు..
 
న‌టుడు రిషి ఫుల్లా మాట్లాడుతూ…సాయి కుమార్ తోట చెప్పిన స్టోరీ లైన్ న‌చ్చి ఈ షార్ట్ ఫిల్మ్ తీసామ‌ని అన్నారు..మా స్క్రీనింగ్ కు త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ గారు రావ‌డం…మా టీమ్ అభినందించ‌డం చాలా ఆనందంగా ఉంద‌న్నారు…
 
ద‌ర్శ‌కుడు సాయికుమార్ తోట మాట్లాడుతూ …ఓ ఫీచ‌ర్ ఫిల్మ్ కు రాసుకున్న క‌థే గిఫ్ట్ అని అన్నారు…రిషి పుల్లా నాకు అన్ని విధాల స‌హాకారం అందించార‌ని తెలిపారు..త‌మ్మారెడ్డి గారు రావ‌డం ..మాకు స‌పోర్ట్ చేయ‌డం ఎప్ప‌టికి మ‌రిచిపోలేమ‌ని అన్నారు.. స్కీనింగ్ వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రికి , టెక్నిషియ‌న్స్ కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు..
 
న‌టీన‌టులు ..రిషి పుల్లా, స‌మీర్ ,జివి సందీప్ ,ప్ర‌త్యూష , ల‌హ‌రి ,ఫ‌ణి కుమార్
ద‌ర్శ‌క‌త్వం ..సాయి కుమార్ తోట‌
నిర్మాణం ..ఆర్ స్టార్ ఎంట‌ర్ టైన్మెంట్స్
అసిస్టెంట్ డైరెక్ట‌ర్స్…సందీప్ ద‌ర‌పు ,రాఘ‌వేంద్ర
మ్యూజిక్ డైరెక్ట‌ర్ ..బోని డేవిడ్
ఎడిట‌ర్ ..కార్తీక్ నంద‌న్