వీరికి ఉగ్రవాద మద్దతుదార్ల తో వ్యాపార లావాదేవీలు?

ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్, భార్య గౌరీలు ఉగ్రవాద మద్దతుదార్లు అయిన రెహాన్ సిద్థిఖీ, టోనీ అషాయ్‌తో కలిసి ఉన్నప్పటి ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐతో బాలీవుడ్ సంబంధాలను తెలిపే వీడియోలు వెలువడ్డాయి. బాలీవుడ్ బాద్షా అనిపించుకునే షారూక్‌కు సతీసమేతంగా రెహాన్‌తో, టోనీతో పలురకాల వ్యాపార లావాదేవీలు ఉన్నాయని తో అంటున్నారు. భారత్ వ్యతిరేక ప్రకటనలు చేసిన ఈ ఇద్దరూ.. జమ్మూ కశ్మీర్‌లో పలు రకాలుగా ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు అందించారని తెలుస్తోంది. అంతేకాకుండా రెహాన్, టోనీలకు ఐఎస్‌ఐతో పలు సంబంధాలు ఉన్నాయని.. వీరిని తరచూ షారూక్, ఆయన భార్యతో కలుస్తుంటారని విన్పిస్తున్నఈ దశలో వెలువడ్డ ఫోటోలు సంచలనం సృష్టించాయి. టోనీ అమెరికాలో ఉంటున్నాడు. భారత్ అంటే పూర్తి స్థాయిలో ద్వేషంతో మండిపడుతున్నాడు. టోనీ కశ్మీర్‌లో జన్మించాడు. ‘కశ్మీరీ యువత రాళ్లు పట్టుకుని, తుపాకులతో ముందుకు సాగాల’నే పలు వ్యాఖ్యలు చేసాడు..జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల సానుభూతిపరుడిగా కూడా టోనీ పేరు పడ్డాడు.
 
రెహాన్ సిద్ధిఖీ పాకిస్థానీ. ఇప్పుడు అమెరికాలోని హుస్టన్‌లో ఉంటున్నాడు. అక్కడ అతనికి సొంతంగా రేడియో ఛానల్ ఉంది. తన ఛానల్ ద్వారా కశ్మీర్‌లో ఉగ్రవాద చర్యలను సమర్థిస్తూ వ్యాఖ్యానాలు చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. సిద్ధిఖీకి సంగీతంలో మంచి ప్రావీణ్యం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా పలు సంగీతకచేరీలు నిర్వహించాడు. వీరితో కలిసి బాలీవుడ్ బాదుషా షారూక్ ఖాన్ వ్యాపారాలు చేస్తున్నారని తెలిపే ఫోటోలు, వీడియోలు ఇప్పుడు ప్రచారంలోకి వచ్చాయి. బిజెపి సీనియర్ నాయకులు బైద్యనాథ్ జయ్ పాండా ఒక్కరోజు క్రితమే బాలీవుడ్ ప్రముఖులు కొందరికి ఐఎస్‌ఐతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. దీనికి సంబంధించి తన వద్ద పలు సాక్షాధారాలు ఉన్నాయన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటిరోజే షారూక్, భార్య గౌరీల ఉగ్రవాద లింక్‌లు తెలిపే ఫోటోలు బయటకు రావడం సంచలనంగా మారింది.