శ్రద్దాదాస్ కు ‘అర్థం’ మంచి టర్నింగ్ పాయింట్ !

ఎడిటర్‌గా, వీఎఫ్ఎక్స్ నిపుణుడిగా అనేక చిత్రాలకు పని చేసి గుర్తింపు తెచ్చుకున్న మణికాంత్ తెల్లగూటి దర్శకత్వంలో డిఫరెంట్ సైకలాజికల్ థ్రిల్లర్‌ కథగా తెరకెక్కిన చిత్రమే “అర్థం”. తమిళం, తెలుగు భాషల్లో రాధిక శ్రీనివాస్ నిర్మిస్తున్నారు.అలాగే మళయాళ, కన్నడ భాషల్లోకి డబ్ చేసి విడుదల చేయ బోతున్నారు. బ్యూటిఫుల్ శ్రద్దాదాస్ మాయ అనే సైకియాట్రిస్ట్‌ (మానసిక వైద్య నిపుణురాలు) చుట్టూ తిరిగే కథతో ఆధ్యంతం ఆసక్తికరంగా సాగే చిత్రమే “అర్థం”. మినర్వా పిక్చర్స్ బ్యానర్‌పై బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రద్దాదాస్ ప్రధాన పాత్రలో ‘దేవి’, ‘పెదరాయుడు’ చిత్రాలతో బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మాస్టర్ మహేంద్రన్, అమని, అజయ్, ఈటీవీ ప్రభాకర్, జబర్దస్త్ రోషిణి, లోబో, నందా దురైరాజ్, సాహితి నటీ నటులుగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ చివరి వారంలో విడుదలకు సిద్దమైన సందర్బంగా చిత్ర యూనిట్  హైదరాబాద్ లో చిత్ర టీజర్ ను విడుదల చేశారు.

బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రద్దా దాస్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నిటికంటే  ఈ సినిమా నాకు స్పెషల్. ఇలాంటి హార్రర్ మూవీలకు వి.యఫ్.ఎక్స్ ఇంపార్టెంట్. డి ఓ పి పవన్ గారు నన్ను చాలా అందంగా చూపించారు. దర్శకుడు మణికాంత్ గారు, మరియు  నిర్మాతలు చక్కని కథను సెలెక్ట్ చేసుకొని ఈ సినిమాను చాలా చక్కగా తెరకేక్కించారు. ఈ మూవీ లో గ్లామర్ రోల్ లో సైకియాట్రిస్ట్‌ గా  నటించాను. ఇందులోని నా పాత్ర చాలా స్పెషల్ గా ఉంటుంది. ఇలాంటి మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలో మంచి టీం తో నటించడం చాలా హ్యాపీ గా ఉందని అన్నారు.

చిత్ర నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇంతకుముందు నేను తీసిన ‘నాటకం’  సినిమాకు అందరూ ఫుల్ సపోర్ట్ చేశారు. వి. యఫ్ ఎక్స్ లో అనుభవం ఉన్న మణికాంత్ తన ప్రొఫెషన్ ను పక్కనపెట్టి, డైరెక్టర్ కావాలనే ప్యాషన్ తో ఉన్న తను చెప్పిన సైకలాజికల్ థ్రిల్లర్ కథ నచ్చడంతో ఈ సినిమాను కోవిడ్ టైమ్ లో స్టార్ట్ చేశాము. రాకేందు మౌళి మా సినిమాకి మాటలు, పాటలు రాశారు. హర్షవర్ధన్ రామేశ్వర్ చక్కటి బాణీలు అందించారు. సుచిత్ర చంద్రబోస్ గారు చక్కని  కోరి్యోగ్రఫీ చేశారు.అలాగే ఈ సినిమాకు ముగ్గురు ఫైట్ మాస్టర్ వర్క్ చేయడం విశేషం. మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర నిర్మాత రాధికా శ్రీనివాస్ మాట్లాడుతూ.. సైకలాజికల్ థ్రిల్లర్ కథకు వినోదం మేళవించి ఆసక్తికరంగా తీర్చిదిద్దుతున్న ఈ మూవీ కి సహకరించిన అందరికీ ధన్యవాదములు. ఇలాగే మీ అందరి బ్లెస్సింగ్స్ తో మా సినిమాను బిగ్ హిట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు

కో ప్రొడ్యూసర్ సాయి దీప్ మాట్లాడుతూ.. నాటకం సినిమా నుండి మా నిర్మాత శ్రీనివాస్ తో ట్రావెల్ అవుతున్నాను. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా నాటకం కంటే  పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర దర్శకుడు మణికాంత్ తెల్లగూటి మాట్లాడుతూ.. మా నాన్న ఒక సినిమా ఆపరేటర్. నేను ఈ రోజు ఈ స్టేజ్ పై ఉండడానికి మా నాన్నే ఇన్స్పిరేషన్. ‘అర్థం’ అంటే ఏమిటి? అనుకుంటున్నారు. కుటుంబ విలువలను కాపాడే, మహిళా సాధికారతను పెంపొందించే సరికొత్త కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో మానవ సంబంధాలు గురించి ప్రతి ఒక్కరి రిలేషన్ గురించి ఇందులో చూపించడం జరిగింది .అత్యుత్తమ నిర్మాణ విలువలతో రాధికా శ్రీనివాస్ గారు సినిమా నిర్మించారు .డి. ఓ. పి.పవన్ మంచి అవుట్ పుట్ ఇచ్చారు. అర్జున్ రెడ్డికి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చిన హర్షవర్ధన్ రామేశ్ గారు ఈ సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చాడు . శ్రద్దా దాస్ కు ఈ  సినిమా మంచి టర్నింగ్ అవుతుంది అన్నారు.