శివశక్తి దత్త చేతుల మీదుగా ‘ప్రేమకు జై’ టీజర్ లాంచ్

నూతన నటీనటులతో శ్రీనివాస్ మల్లం దర్శకత్వంలో ‘ప్రేమకు జై’ చిత్రం రూపోందింది. యంగ్ టాలెంటెడ్ అనిల్ బురగాని, ఆర్.జ్వలిత హీరోహీరోయిన్లుగా.. ప్రతినాయకునిగా దుబ్బాక భాస్కర్ నటించారు. ఈశ్వర పరమేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై  అనసూర్య  నిర్మించిన ‘ప్రేమకు జై’  గ్రామీణ నేపథ్యంలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా నూతన నటీనటులతో శ్రీనివాస్ మల్లం దర్శకత్వంలో  రూపోందింది. పోస్ట్ ప్రోడక్షన్ పూర్తి చేసుకున్న ‘ప్రేమకు జై’ నూతన సంవత్సరంలో విడుదల కానుంది. ప్రఖ్యాత లిరిక్స్ రైటర్ శివశక్తి దత్త చేతుల మీదుగా పోస్టర్, టీజర్ రిలీజ్ చేయడం జరిగింది.
శివశక్తి దత్త మాట్లాడుతూ….” నూతన న‌టీనటులు చాలా అద్భుతంగా నటించారు. డైరెక్షన్  చాలా బాగుంది. ఈ టీజర్ చాలా బాగుంది. చిత్ర యూనిట్ శుభాకాంక్షలు” అన్నారు. ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు హీరోహీరోయిన్లు కృతజ్ఞతలు తెలిపారు…
ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్:  మైలారం రాజు, DOP:  ఉరుకుందా రెడ్డి,
మ్యూజిక్ : చైతు, ఎడిటర్: సామ్రాట్ జి