చివరి షెడ్యూల్లో సుజాత బౌరియా ‘జబ్బర్ధస్త్ గబ్బర్ సింగ్’

‘జబ్బర్ధస్త్ గబ్బర్ సింగ్’ నిర్మాత రాచకొండ చక్రధర్ మాట్లాడుతూ… ఒక కొత్త కథ కథనం తో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.యాక్షన్ కామిడి హర్రర్ నేపథ్యంలో చిత్రం ఉంటుంది. రెండు గంటల పాటు ప్రేక్షకులును రంజింప చేసేలా ఒక సరికొత్త కధ కథనంతో వచ్చే నెల సినిమాను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము అని అన్నారు..
మరో నిర్మాత రాం మోహన్ యాదవ్ మాట్లాడుతూ….
ప్రి క్లైమాక్స్ దశలో జబ్బర్ధస్త్ గబ్బర్ సింగ్ ఆర్టిస్టులతో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నం. క్లాస్ మాస్ ఆడియన్స్ కి నచ్చేలా భారీ తారాగణంతో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాం అన్నారు
దర్శకురాలు సుజాత బౌరియా మాట్లాడుతూ…
ప్రి క్లయిమాక్స్ లో ‘జబ్బర్ధస్త్’ ఫేమ్ హైపర్ అది బ్యాచ్ & ‘గబ్బర్ సింగ్’ ఫేమ్ ఫిష్ వెంకట్ బ్యాచ్ మధ్యలో జరిగే కామెడీ సన్నివేశాలు చిత్రీకరించాము. సినిమా లో ఈ రెండు బ్యాచ్ ల మధ్య జరిగే  కామెడీ సీన్స్ ప్రేక్షకులను కడుపుపుబ్బా నవ్విస్తాయి. అందరూ చాలా బాగా నటించారు.ఒక కొత్త ఆలోచనతో ముందుకు వెళ్తేనే మనకు ఒక కొత్త ప్రపంచం పరిచయం అవుతుంది.స్టోరీ ని నమ్ముకోని ఈ సినిమా చేస్తున్నాము.ఈ కథకు జబ్బర్ధస్త్ గబ్బర్ సింగ్  టైటిల్100% సూటబుల్.ప్రతి సన్నీ వేశాన్ని చాలా అద్భుతంగా చిత్రీకరిస్తున్నాం.ఈ సినిమా టైటిల్ కి 100% నాయ్యం చేకూర్చేలా,కథ డిమాండ్ ని బట్టి ఖర్చుకు  వెనకాడకుండా క్వీలిటీ కోసం తపించే నిర్మాతలు దొరకడం నా అదృష్టం గా భావిస్తున్నా.. ఈ సినిమా తో ఒక కమర్షియల్ హిట్ అందుకుంటానని 100% కాన్ఫిడెన్స్ తో ఉన్న అన్నారు డైరెక్టర్ సుజాత బౌరియా
సంగీత దర్శకుడు శ్రీ కోటి మాట్లాడుతూ… ఈ చిత్రం లో హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కోసం
ఒక ప్రత్యేక పాటను కంపోజ్ చేయడం జరిగింది. ఈ పాట కాసర్ల శ్యామ్ గారు రాశారు.
కథ డిమాండ్ మేరకు ఈ పాట చేయడం చాలా ఆనందం తో పాటు నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పాట ప్రతి ఒక్కరినీ మెస్మ రైజ్ చేస్తూ 2018 లో టాప్ టెన్ పాటల్లో మా పాట కూడా ఒకటిగా నిలిచిపోతుంది అని సంగీత దర్శకుడు శ్రీ కోటి తెలిపారు