వారు ఏం చేసినా పబ్లిసిటీ కోసమే !

పంజాబీ బ్యూటీ తమన్నా సినిమాల సంగతి ఏమోగానీ, ఈ అమ్మడి వ్యక్తిగత  స్టేట్మెంట్లు …ఇటీవల పలు రకాలుగా హల్‌చల్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా… ‘ఆయనతో డేటింగ్‌ చేయాలి!’, ‘వారితో ప్రేమ లేదు’ లాంటివి సోషల్ మీడియా లో హోరెత్తుతున్నాయి. తాజాగా బాలీవుడ్‌ సంచలన యువ నటుడు విక్కీ కౌశల్‌తో డేటింగ్‌ చేయాలనుందని తమన్నా వార్తల్లోకి ఎక్కింది. ఈ అమ్మడు ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ… బాలీవుడ్‌ నటుడు విక్కీ కౌశల్‌తో డేటింగ్‌ చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. బాలీవుడ్‌లో ‘యురి’ చిత్రంతో సంచలన నటుడిగా పేరు తెచ్చుకున్న విక్కీ కౌశల్‌కి ఇప్పుడు అక్కడ క్రేజ్ చాలా పెరిగింది. విక్కీ ఇటీవలే తన ప్రేయసి నుంచి దూరం అయ్యారు. ఇక నటి తమన్నా విషయానికి వస్తే.. ఆ మధ్య క్రికెట్‌ క్రీడాకారుడు విరాట్‌ కోహ్లీ అంటే ఇష్టం అని పేర్కొంది.అయితే తానాయన్ని ఎప్పుడూ ప్రేమించలేదని చెప్పుకొచ్చింది. అయితే వీరిద్దరూ ఒక వాణిజ్య ప్రకటనలో కలిసి నటించారు. అప్పుడు వారి మధ్య ప్రేమ వ్యవహారం నడిచిందనే ప్రచారం జోరుగా సాగింది. అయితే ఆ యాడ్‌ చిత్రీకరణ సమయంలో తాను కోహ్లీతో నాలుగు మాటలే మాట్లాడానని తమన్నా అంటోంది. ఆ తరువాత ఆయనతో టచ్‌లో లేనని చెప్పింది.

ఇక ఈ అమ్మడి గురించి ప్రచారంలో ఉన్న మరో విషయం అమెరికాకు చెందిన ఒక వైద్యుడితో ప్రేమ కలాపాలు సాగిస్తోందన్నది. ఈ ఏడాది ఆయనతో పెళ్లికి సిద్ధం అవుతోందని టాక్‌. అయితే తాను ఏ డాక్టర్‌ను ప్రేమించలేదని తమన్నా  అంటోంది. కాగా ఇంతకుముందు బాలీవుడ్‌ నటుడు హృతిక్‌రోషన్‌కు ‘లిప్‌ టూ లిప్‌’ చుంభనానికి రెడీ అని పేర్కొంది. తాజాగా  యువ నటుడు విక్కీ కౌశల్‌పై దృష్టి పడింది. ఆయనతో డేటింగ్‌ చేయాలనుందన్న కోరికను బయట పెట్టింది. రేపు ‘తానలా అనలేద’ని అన్నా ఆశ్చర్యపడనక్కర్లేదు. ఇదంతా సంచలన స్టేట్‌మెంట్‌తో వార్తల్లో ఉండటానికి చేస్తున్న ఫీట్లుగా సినీ వర్గాలు పేర్కొంటున్నారు. ఇంకో తమాషా  ఏమిటంటే…”నేను మగాడిని అయ్యుంటే తమన్నని పెళ్లి చేసుకునేదాని”ని అంటూ శృతి హసన్ స్టేట్ మెంట్ ఇవ్వడం. ఏదేమైనా ఈ మిల్కీబ్యూటీ తమన్నా నటిగా మాత్రం బిజీగానే ఉంది. ప్రస్తుతం టర్కీలో విశాల్‌తో రొమాన్స్‌ చేస్తోంది.