అనేక దేశాల్లో … ముప్పై అందాల లొకేషన్స్ లో …

అందాల నటి త్రిష ఒక వెరైటీ చిత్రం లో చేస్తోంది . ఈ సినిమా మొత్తం ప్రయాణం లోనే  జరుగుతుందట. ఈ సినిమాని ప్రేక్షకులు మెచ్చేలా దర్శక నిర్మాతలు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు. అందమైన లొకేషన్స్ కోసం అనేక దేశాలు చుట్టొస్తున్నారు. ఎంత ఖర్చు అయినప్పటికి అందంగా ప్రజెంట్ చేయాలనే భావనలోనే యూనిట్ ఉంది. ఈ క్రమంలో మెడ్రాస్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై నిర్మితమవుతున్న “96” చిత్ర షూటింగ్ కోసం యూనిట్ 30 లొకేషన్స్ చుట్టేయనుందట.

ఇప్పటికే అండమాన్, కులుమనాలి ప్రాంతాలలో చిత్ర హీరో విజయ్ సేతుపతి, హీరోయిన్ త్రిషలకి సంబంధించి కీలక సన్నివేశాలు తెరకెక్కించారట. ఇక రాజస్థాన్, కోల్ కత్తాలో కొంత షూటింగ్ పూర్తి చేసుకున్న “96” చిత్ర టీం త్వరలో కుంభ కోణంలో షూటింగ్ జరుపుకోనుంది. ఆ తర్వాత వేరే లొకేషన్స్ లో త్రిష, విజయ్ సేతుపతి పై సాంగ్స్, కీలక సన్నివేశాలు షూట్ చేయనున్నారు. ఈ మూవీ ట్రావెలింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం కాబట్టే అన్ని లొకేషన్స్ చుట్టొస్తున్నట్టు యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. విజయ్ సేతుపతితో త్రిష తొలి సారి నటిస్తున్న ఈ చిత్రానికి సీ.ప్రేమ్‌కుమార్‌ కథ అందిచడంతో పాటు డైరెక్ట్ చేస్తున్నాడు. ఎస్ నందగోపాల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోవింద్ మీనన్ సంగీతం అందిస్తున్నాడు.