జొన్న పరమేష్, రాధ బంగారు జంటగా ఉలి దర్శకత్వంలో మాస్టర్ గోవింద్ బోగోజు సమర్పణలో సరోవర్ ఫిలిమ్స్ పతాకంపై ఉప్పుల గంగాధర్ నిర్మిస్తోన్న చిత్రం `నీ ప్రేమ కోసం`. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం ఉదయం హైదరాబాద్ పిలిం ఛాంబర్ లో ఘనంగా జరిగింది. గౌరవ అతిథి పాత్రలో నంబి వేణుగోపాలాచార్య కౌశిక, ముఖ్య అతిథి పాత్రలో సింహరాజు కొదండ రాములు, ప్రత్యేక పాత్రలో శ్రీ మంజునాథ విజయ్ బాబు నటిస్తున్నారు.
నంబీ వేణుగోపాలా చార్య కౌశిక సీడీలను ఆవిష్కరించి అతిధులకు , యూనిట్ సభ్యులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, `ఉలి అన్నీ తానై పనిచేశాడు. అతని కష్టానికి తగ్గ ఫలితం అందుకుంటాడు. ప్రతిభ గల దర్శకుడు. సినిమా విజయం సాధించి యూనిట్ అందిరకి మంచి పేరు, ప్రఖ్యాతలు తీసుకురావాలి` అని అన్నారు.
చిత్ర దర్శకుడు ఉలి మాట్లాడుతూ, `రొటీన్ లవ్ స్టోరీలకు భిన్నంగా ఉండే సినిమా ఇది. ప్రపంచ శాంతి సందేశంలో అద్భుతమైన ప్రేమకథా చిత్రంగా నిలుస్తుంది. ప్రేమ కాన్సెప్టెకు..నేను పెట్టిన `డు ఆర్ డై` అనే ఉపశీర్షికకు సంబంధం ఏంటని చాలా మందికి సందేహాలున్నాయి. అది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ కథను ఓ ఛాలెంజింగ్ గా తీసుకుని తెరకెక్కించాను. అంతా చక్కగా నటించారు. ప్రేక్షకులంతా మా సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నా` అని అన్నారు.
సహ నిర్మాత: గోలి వెంకట రమణ మాట్లాడుతూ, ` నిజ జీవితంలో మనుషుల పాత్రలు మా సినిమాలో కనిపిస్తాయి. ప్రతీ ఒక్కరి జీవితంలో ఎన్నో రకాల సమస్యలు, బాధలు ఉంటాయి. వాటిని మా దర్శకుడు కళ్లకు కట్టినట్లు చూపించారు. పాటలు, సినిమా పెద్ద విజయం సాధిస్తాయని ఆశిస్తున్నా` అన్నారు.
హీరోయిన్ రాధ బంగారు మాట్లాడుతూ, ` నాకిది తొలి సినిమా. మంచి పాత్రలో నటిస్తున్నా. అందరికీ నచ్చుతుంది. సినిమా కోసం టీమంతా చాలా కష్టపడి ఇష్టంగా పనిచేసాం` అని అన్నారు. ఈ కార్యక్రమంలో సంజయ్, పులి అమృత్ గౌడ్, పాండు రంగారావు, సింహరాజు, మంజులా సిరాజ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రంలో సాయి డిజిటల్ రవి, కళ్యాణ్ చక్రవర్తి, అశోక్ బోగే, రమ్య శ్రీ, కాసాల శ్రీనివాస్, కొమ్ము సుజాత, కంప్యూటర్ ప్రభాకర్, వంశీ కృష్ణ, కే.ఆర్, కృష్ణ, మాస్టర్ గోవింద్ బోగోజు, విష్ణుగిరి, యెన్నమనేని శ్రీనివాసరావు, వెంటరమణ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వేమూరి చంద్రశేఖర్, ఎడిటింగ్: సంపత్ రాజ్, సత్రాజ్, ఆర్ట్: బొద్దున జయకృష్ణ, సంగీతం: కె. లక్ష్మణ సాయి, నిర్మాత: ఉప్పుల గంగాధర్, కథ, మాటలు, పాట, చిత్రకథనం, దర్శకత్వం: ఉలి.