భరత్ దర్శకత్వంలో ‘విక్రమ్ రెడ్డి’

సoబిత్ ఆచార్య, అనుష్క జంటగా భరత్ దర్శకత్వంలో బుద్ధ భగవాన్ క్రియేషన్స్ బ్యానర్ పై యేలూరు సురేందర్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘విక్రమ్ రెడ్డి’ ఈ చిత్రాన్ని రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో రొమాంటిక్ యాక్షన్ గా నిర్మించారు.
 
ఈ చిత్ర నిర్మాత సురేందర్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ దాసరి నారాయణరావు ప్రోత్సాహంతో చిత్ర పరిశ్రమ కి వచ్చాను .నేను ఇప్పటివరకు యాభై చిత్రాలు తీశాను ఈ చిత్రంలో అద్భుతమైన 8 ఫైట్స్ బాగా హెవీ గా హాలీవుడ్ తరహాలో ఉంటాయన్నారు యూత్ కి కావలసిన మంచి రొమాంటిక్ సన్నివేశాలు ముద్దులు ఉంటాయి.ప్రతి ఫైట్ లోను 40 మంది ఫైటర్స్ తో రూపొందించాము. ఇటీవల మా బ్యానర్ లో డాక్టర్ రాజశేఖర్ నటించిన ‘మహంకాళి’ అందరికి తెలిసిందే .మాస్ ఎలిమెంట్స్ తో హీరో శ్రీహరి తో ‘గురి’ సినిమా . సాయికుమార్, థ్రిల్లర్ మంజు ‘జనం’ సినిమా రాంలక్ష్మన్ ల తో పాటు మంచి లవ్ సెంటిమెంట్ రూపొందించనున్నారు.సినిమా సక్సస్ కి మాస్ ఎలిమెంట్స్ ప్రధానంగా నమ్ముతా . ఈ చిత్రంలోని హీరో సంబిట్ ఆచార్య చేసిన యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలెట్ 75రోజుల పాటు సినిమా షెడ్యూల్ పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ సినిమాలో రెండు పాటలు ఉంటాయి.
 
సంబిట్ ఆచార్య అనిక జంటగా సుమన్, ఆర్కే ఫిష్ వెంకట్, మాణిక, అపూర్వ,మాధవరెడ్డి, వికాసిని, శ్రీ లలితా, ప్రియాంక , తార ,లక్ష్మి, ఇషిత, సైరా, షాయాజి షిండే,సలీం పాండా, ఆలోక్ జైన్ , యోగి కత్తి, సమ్రేష్, శ్రీతందాస్ ,ఏలీయా (రష్యా )డైనా మెరియా (తజాకిస్థాన్),నటాలియా కత్తినా (కాశ్మీర్ )వీరు అయిదుగురు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేశారు.
ఫైట్స్: దేవరాజ్, కెమెరా : ఆళ్ల రాంబాబు, చక్రి, సంగీతం : డ్రమ్స్ శివ, ఎడిటర్ : గౌతమ్ రాజు,,దర్శకుడు: భారత్