నితిన్‌ విడుదల చేసిన ‘అభిమన్యుడు’ మొదటి పాట

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘అభిమన్యుడు’. ఎం.పురుషోత్తమన్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై జి.హరి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్నారు.
ఈ చిత్రంలోని మొదటి పాటను యూత్‌స్టార్‌ నితిన్‌ ఈరోజు సాయంత్రం 5 గంటలకు విడుదల చేశారు. ‘తొలి తొలిగా తొలకరి చూసి పిల్లాడ్నై.. విప్పారిన కన్నుల్తో లోకాన్నే చూశా..’ అంటూ సాగే ఈ పాటను శ్రేష్ట రచించగా, యువన్‌ శంకర్‌ రాజా సంగీత సారధ్యంలో జితిన్‌రాజ్‌ ఆలపించారు.
ఈ సందర్భంగా హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ అధినేత జి.హరి మాట్లాడుతూ ”హీరో నితిన్‌గారు ఈ చిత్రంలోని మొదటి పాటను విడుదల చేశారు. యువన్‌ శంకర్‌రాజా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. విశాల్‌ కెరీర్‌లోనే హయ్యస్ట్‌ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం” అన్నారు. మాస్‌ హీరో విశాల్‌, సమంత, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌తోపాటు భారీ తారాగణం ఈ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: జార్జి సి. విలియమ్స్‌, ఎడిటింగ్‌: రూబెన్‌, ఫైట్స్‌: దిలీప్‌ సుబ్బరాయన్‌, ఆర్ట్‌: ఉమేష్‌ జె.కుమార్‌, మాటలు: రాజేష్‌ ఎ.మూర్తి, సహ నిర్మాత: ఇ.కె.ప్రకాశ్‌, నిర్మాత: జి.హరి, దర్శకత్వం: పి.ఎస్‌.మిత్రన్‌.
Mass Hero Vishal’s ‘Abhimanyudu’ Is Ready For Release
Mass Hero Vishal’s next is ‘Abhimanyudu’, an action entertainer in PS Mithran’s Direction. G.Hari is releasing the film in Telugu under his Hari Venkateswara Pictures banner, Presented by M.Purushottaman.
Youth Star Nithiin Released The First Single
Youth Star Nithiin has released the first single which goes on with lyrics, “Tholi Tholigaa Tholakari Chusi Pillaadinai…Vippaarina Kallatho Lokaanne Chusaane…” written by Sreshta, crooned by Jithinraaj. Yuvan Shankar Raja has composed the Music. On this occasion Hari Venkateswara Pictures G.Hari said, ” Hero Nithiin Garu released the first song of the film. Yuvan Shankar Raja has given superb tunes. This film is being made with highest budget in Vishal’s career. Shooting part has been completed. Film is currently in post production stage. Film will hit the screens very soon.”
Along with Mass Hero Vishal, Samantha, Action King Arjun, casting involves many popular actors.Music : Yuvan Shankar Raja, Cinematography : George C Williams, Editing : Ruben, Fights : Dileep Subbarayan, Art : Umesh J Kumar, Dialogues : Rajesh A Murthy, Co-Producer : EK Prakash, Producer : G.Hari, Director : PS Mithran
Youth Star @actor_nithiin released #TholiTholigaTholakari single from Mass Hero @VishalKOfficial @Samanthaprabhu2’s #Abhimanyudu @thisisysr Musical @Psmithran Film @VffVishal @HVPOfficial Production https://youtu.be/4qb-kxcr42w