‘కురుక్షేత్రం’ టైటిల్ టీజర్ విడుదల

వెండితెరపై మార్షల్ ఆర్ట్స్ కు మంచి గుర్తింపు తెచ్చిన అర్జున్.. ఇమేజ్ నే ఇంటిపేరుగా మార్చుకుని యాక్షన్ కింగ్ గా మారాడు. యాక్షన్ హీరోగా దక్షిణాది ప్రేక్షకులందరికీ సుపరిచుతుడైన అర్జున్.. ఇప్పుడు తన కెరీర్ లో అత్యంత అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఆ తరం హీరోలంతా రిటైర్ అవుతోన్న వేళ తను ఏకంగా హీరోగా 150వ సినిమా చేస్తున్నాడు. అదే కురుక్షేత్రం. అర్జున్ ఇమేజ్ కు అనుగుణంగా.. అత్యంత స్టైలిస్డ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీ టైటిల్ టీజర్ విడుదల చేశారు.

తెలుగుతో పాటు తమిళ్, కన్నడలోనూ విడుదలవుతోన్న ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు అరుణ్ వైద్యనాథన్. ఇప్పటికే కన్నడ టైటిల్ టీజర్ అక్కడి స్టార్ హీరోలను సైతం మెస్మరైజ్ చేసింది. ఇప్పుడు తెలుగులో విడుదలైన టైటిల్ అండ్ టీజర్ కూ అదే స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. తెలుగులో మరో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ను చూడబోతున్నామనే ఫీలింగ్ ఈ టీజర్ చూస్తుంటేనే కలుగుతోంది. అర్జున్ కెరీర్ లో మరో బెస్ట్ మూవీగా తెరకెక్కిన ఈ మూవీ ప్రస్తుతం పోస్ట ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. మిగిలిన అన్ని కార్యక్రమాలూ అతి త్వరలోనే పూర్తి చేసుకుని కురుక్షేత్రం చిత్రాన్ని జూలైలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు..

యాక్షన్ కింగ్ అర్జున్ తో పాటు వరలక్ష్మీ శరత్ కుమార్, సుమన్, సుహాసిని, ప్రసన్న, వైభవ్, శ్రుతి హరిహరన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.. సాంకేతిక నిపుణులు : సంగీతం : నవీన్, సినిమాటోగ్రఫీ : అరవింద్ కృష్ణ, ఎడిటింగ్ : సతీష్ సూర్య, నిర్మాణం : సాయిగీతా ఫిలిమ్స్, దర్శకత్వం : అరుణ్ వైద్యనాథన్..