చిత్ర దర్శకుడు అప్సర్ మాట్లాడుతూ… గంధర్వ అనేది యూనిట్ పాయింట్. ఇంతవరకు ఎక్కడా రాని పాయింట్. ఈ కథతో ఆరేళ్ళుగా జర్నీచేసుకుంటూ క్లయిమాక్స్ ఎలా తీయాలని ఆలోచించాం. సైన్స్ పరంగా ఇజ్రాయిల్‌లో జరిగిన ఓ రీసెర్చ్‌ను పట్టుకుని ఇందులో యాడ్ చేశాం. క్లయిమాక్స్ అందరినీ మెప్పించేలా చేశాం. నేను కథను సందీప్ కోసం రాసుకోలేదు. కథే ఆయన దగ్గరకు వెళ్ళింది. టెక్నికల్‌గా కెమెరా జవహర్ రెడ్డి, ఎడిటర్ బసవపైడిరెడ్డి పనిచేశారు. ఫస్ట్ కాపీ చూశాక సురేష్‌కొండేటిగారు నేను ఈ సినిమాను విడుదల చేస్తానని అనడం మాకు మొదటి విజయంగా భావించాం. ప్రివ్యూ వేశాం. అద్భుతమైన స్పందన వచ్చింది. ఇందులో గాయత్రీ ఆర్. సురేష్, శీతల్ భట్ పోటాపోటీగా నటించారు. కొన్ని యాక్షన్ సీన్స్‌లో మమ్మల్ని హీరో భయపెట్టాడు. లఢాక్‌లో మైనస్ డిగ్రీ వాతావరణం వుండగా కొండపైకి వెళ్ళి రిస్కీ షాట్ చేశారు. గంధర్వలో పాత్ర పరంగా ఆయనకు మంచి పేరు వస్తుంది. షకీల్ సంగీతం బ్యూటిఫుల్‌గా ఇచ్చాడు అని చెప్పారు.
హీరో సందీప్ మాధవ్ మాట్లాడుతూ… టైటిల్ల్లోనే కొత్తదనం వుంది. క్యూరియాసిటీతో కథ మొదలవుతుంది. థ్రిల్లర్ ఫీల్‌ను ఫ్యామిలీ డ్రామా చొప్పించి కామెడీ, యాక్షన్ అంశాలన్నీ మిళితం కావడంతో చూసిన వారికి బాగా నచ్చుతుంది. సైన్స్ ఫిక్షన్ కావడంతో కథ చాలా కొత్తగా ఫీలవుతారు అని తెలిపారు.
ఎస్.కె. ఫిలింస్ అధినేత సురేష్ కొండేటి మాట్లాడుతూ… ఇప్పటి ట్రెండ్‌కు గంధర్వ ఎలా వుంటుందనే ఆలోచనతో ఇటీవలే షోలు వేశాం. వారి స్పందన చాలా అద్భుతంగా వుంది. దాంతో సినిమాపై మాకు ఫుల్ నమ్మకం వచ్చేసింది. జర్నలిస్టుగా నా 31 ఏళ్ళ అనుభవంతో చూడని కథ గంధర్వ. ఇండియన్ సినిమాలో ఇంతవరకు రాని పాయింట్. సందీప్‌కు వంగవీటి, జార్జిరెడ్డి తర్వాత ఈ సినిమా హ్యాట్రిక్ అవుతుంది. ఫోటోగ్రపీ, సంగీతం, హీరోయిన్ల అభినయం చాలా బాగా కుదిరాయి. పోసాని కృష్ణ మురళి సీన్స్ యూత్‌కు బాగా పడుతుంది. ఈ సినిమాను చూపించి అమ్మవచ్చు అనే ధైర్యంతో చూపించాం. అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను అని చెప్పారు.