‘ఆకాశం నీ హద్దురా’ టీజర్ విడుదలైంది!

సూర్య ‘ఆకాశం నీ హద్దురా’ టీజర్ విడుదలైంది. ‘కలెక్షన్ కింగ్’ మోహన్‌బాబు వాయిస్ ఓవర్‌తో ఈ టీజర్ మొదలవడం విశేషం. వెంకటేష్ తో ‘గురు’ వంటి హిట్ మూవీ అందించిన సుధ కొంగర ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు.
సొంతంగా ఒక ఎయిర్‌లైన్స్ కంపెనీ పెట్టాలని కలలుకనే ఒక మిడిల్ క్లాస్ యువకుడిగా సూర్య కనిపిస్తున్నారు. టాటా కు కూడా సాధ్యం కాని కల కంటున్నావంటూ అతడిని అవమానిస్తుంటారు. యథార్థ గాథ తో రూపొందుతోన్న ఈ సినిమా.. “అనేక అవరోధాల్ని ఎదుర్కొని తను అనుకున్నది సాధించే ఒక సాధారణ వ్యక్తి కథ”ని చూపుతుంది .
గ్రిప్పింగ్ స్టోరీలైన్‌తో ఈ సినిమా తయారవుతోందని ..మధ్యతరగతి యువకునిగా సూర్య నటన ఈ సినిమాకు హైలైట్ అవుతుందనేది స్పష్టం. జెహోవాసన్ అల్ఘర్ స్వరపరిచిన బీజీయం ఉత్కంఠను కలిగిస్తోంది. 2డి ఎంటర్‌టైన్‌మెంట్, సిఖ్య ఎంటర్‌టైన్మెంట్ పతాకాలపై సూర్య, రాజశేఖర్ కర్పూరసుందర పాండ్యన్, గునీత్ మోంగా, ఆలిఫ్ సుర్తి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అత్యున్నత స్థాయిలో నిర్మాణ విలువలు ఉన్నాయి. డాక్టర్ ఎం. మోహన్‌బాబు, పరేష్ రావల్, అపర్ణా బాలమురళి, ప్రకాష్ బెలవాది, ఊర్వశి, కరుణాస్, వివేక్ ఈ చిత్రంలో కీలక పాత్రధారులు. 2020 వేసవికి విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
 
డైలాగ్స్: రాకేందు మౌళి, స్క్రీన్‌ప్లే: షాలిని ఉషాదేవి, సుధ కొంగర
అడిషనల్ స్క్రీన్‌ప్లే: ఆలిఫ్ సుర్తి, గణేశా,మహా థీం లిరిసిస్ట్: ప్రణవ్ చాగంటి,సంగీతం: జి.వి. ప్రకాశ్‌కుమార్,సినిమాటొగ్రఫీ: నికేత్ బొమ్మి,ఎడిటింగ్: సతీష్ సూర్య,ఆర్ట్: జాకి
బ్యాగ్రౌండ్ స్కోర్ సూపర్‌విజన్, ఎడిటింగ్: జెహోవాసన్ అల్ఘర్
కొరియోగ్రఫీ: శోబి, శేఖర్ వి.జె., ఫైట్స్: గ్రెగ్ పోవెల్, విక్కీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: అచిన్ జైన్, పవిత్ర
సహ నిర్మాతలు: రాజశేఖర్ కర్పూర సుందరపాండ్యన్, గునీత్ మోంగా, ఆలిఫ్ సుర్తి,నిర్మాత: సూర్య