రామానాయుడు గారంటే ఓ హీరో, రోల్ మోడల్!

‘మూవీ మొగల్’ డా.డి రామానాయుడు 85 వ జయంతి కార్యక్రమం హైదరాబాదు ఫిలిం ఛాంబర్ ఆవరణలో జరిగింది. ‌ఈ కార్యక్రమంలో సురేష్ బాబు , సి.కల్యాణ్ , కె.ఎస్.రామారావు, అభిరామ్ దగ్గుబాటి, కాజా సూర్యనారాయణ, జె. బాలరాజు పాల్గొని రామానాయుడు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు..
నిర్మాత సి‌.కల్యాణ్ మాట్లాడుతూ .. రామానాయుడు గారంటే మాకు ఓ హీరో, రోల్ మోడల్. నన్ను దాసరి గారు ,రామానాయుడు గారు ఎంతో ప్రొత్సహించిన వ్యక్తులు. నిర్మాతలగానే కాకుండా , సినీ పరిశ్రమ, దానికి అనుబంధ సంస్థలన్నీ డెవలప్ కావటానికి రామానాయుడు గారే కారణం. నాయుడుగారిని తలుచుకుని మేము సినిమా స్టార్ట్ చేస్తాము. ఆయన జయంతి ని ఎప్పుడూ గొప్పగా జరుపుకుంటామన్నారు. రామానాయుడు గారి వారసుడిగా అభిరామ్ ఆయన ప్లేస్ ను భర్తీ చేస్తాడన్నారు.
 
జూబ్లీహిల్స్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ మాట్లాడుతూ… 85 వ జయంతి సందర్భంగా రామానాయుడు ‌గారికి నివాళులు అర్పించాము. రామానాయుడు గారు లేకుంటే హైదరాబాదు లో సినిమా పరిశ్రమ, ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీ ఉండేది కాదు.. ఫిలిం నగర్ లో విగ్రహం తో పాటు ,రామానాయుడు గారి పేరుతో ఏది మొదలు పెట్టినా సక్సెస్. ఫిలింనగర్ కు చెన్నారెడ్డి, దాసరి, రామానాయుడు గారు దేవుళ్ళు వంటివారన్నారు.
ప్రముఖ నిర్మాత కె.ఎస్‌రామారావు మాట్లాడుతూ .. నిర్మాతగా నాకు రామానాయుడు గారే స్పూర్తి.‌ వారి ఫాలోవర్ గా సినిమాలు చేశాను. మా బ్యానర్ లో మంచి సినిమాలు రావటానికి నాయుడు గారి ప్రోత్సాహం ఎంతో ఉందన్నారు.
రామానాయుడు మనవడు అభిరామ్ మాట్లాడుతూ.. తాత గారు భౌతికంగా లేకున్నా,మెంటల్ గా నాకు సపోర్ట్ గానే ఉంటారన్నారు.