కె.రాఘ‌వేంద్రరావు ‘పెళ్లి సంద‌D’ టీజర్ : నాగార్జున విడుదల!

“ద‌ర్శ‌కేంద్రుడు” కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై కె.కృష్ణ మోహ‌న్రావు స‌మ‌ర్ప‌ణ‌లో.. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని ‘పెళ్లి సంద‌D’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘పెళ్లి సంద‌D’తో కె. రాఘ‌వేంద్ర‌రావు మ‌రోసారి మ్యాజిక్‌ను రిపీట్ చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఇందులో ఆయ‌న న‌టుడిగా కూడా ఎంట్రీ ఇస్తుండ‌టం విశేషం. ఈ బ్యూటీఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ కు ఆయ‌న శిష్యురాలు గౌరి రోణంకి దర్శకురాలు .
అప్పట్లో కె. రాఘ‌వేంద్ర‌రావు తెర‌కెక్కించిన `పెళ్లిసంద‌డి`లో శ్రీ‌కాంత్ హీరో.. అయితే నేడు ఆయ‌న ద‌ర్శ‌క‌త్వ పర్య‌వేక్ష‌ణ‌లో గౌరి రోణంకి డైరెక్ట్ చేస్తున్న ‘పెళ్లిసంద‌D’లో శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్ హీరో అవ‌డం విశేషం. శ్రీలీల హీరోయిన్‌.  ‘పెళ్లి సంద‌D’ టీజ‌ర్‌ను కింగ్ నాగార్జున విడుద‌ల చేసి.. ‘పెళ్లి సంద‌D’ చాలా పెద్ద హిట్ కావాలంటూ చిత్ర యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు. పెళ్లి భోజ‌నం ఎంత చ‌క్క‌గా ఉంటుందో అంతే చ‌క్క‌గా మా ‘పెళ్లి సంద‌D’  సినిమా ఉంటుంద‌నేలా టీజ‌ర్ ఉంది. ‘పెళ్లిసంద‌D’ నుంచి విడుద‌లైన రాఘవేంద్ర‌రావు ప్రోమో,  హీరో, హీరోయిన్ ప్రోమోలు, సాంగ్స్ అన్నింటికీ ప్రేక్ష‌కుల నుంచి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది.  నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా విడుదల గురించి తెలియజేస్తాం’ అని దర్శకురాలు గౌరి రోణంకి తెలిపారు.
రోష‌న్, శ్రీ‌లీల, ప్ర‌కాశ్‌రాజ్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, రావు ర‌మేష్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, పోసాని కృష్ణ ముర‌ళి, వెన్నెల కిషోర్‌, స‌త్యంరాజేష్‌, రాజీవ్ క‌నకాల‌, శ్రీ‌నివాస్ రెడ్డి, శక‌లక శంక‌ర్‌, అన్న‌పూర్ణ‌, జాన్సి, ప్ర‌గ‌తి, హేమ‌, కౌముది, భ‌ద్రం, కిరీటి నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీర‌వాణి, సాహిత్యం: శివ‌శ‌క్తి ద‌త్త‌, చంద్ర‌బోస్, సినిమాటోగ్ర‌ఫి: సునీల్ కుమార్ నామ, ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు
ఆర్ట్‌: కిర‌ణ్ కుమార్ మ‌న్నె, మాట‌లు: శ్రీ‌ధ‌ర్ సీపాన‌,ఫైట్స్‌: వెంక‌ట్, కొరియోగ్ర‌ఫి: శేఖ‌ర్ వీజే