క‌ళ్యాణ్ దేవ్, రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రం

తొలి సినిమా విజేత తోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో కళ్యాణ్ దేవ్ రెండో సినిమా ఖరారైంది.. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమా ని నిర్మిస్తుంది..నూతన దర్శకుడు పులి వాసు దర్శకత్వం వహిస్తున్నారు.. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.. ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తుండగా ఖుర్షీద్ (ఖుషి) సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.. ఈ సినిమా లో రాజేంద్రప్రసాద్, నరేష్ వీకే, పోసాని కృష్ణ మురళి, ప్రగతి ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు..త్వరలోనే మిగితా ఆర్టిస్టులు, టెక్నిషియన్ల వివరాలు వెల్లడిస్తామని నిర్మాత రిజ్వాన్ తెలిపారు..
 
నటీనటులు: కల్యాణ్ దేవ్, రాజేంద్రప్రసాద్, నరేష్ వీకే, పోసాని కృష్ణ మురళి, ప్రగతి
 
సాంకేతిక నిపుణులు :
దర్శకుడు: పులి వాసు
నిర్మాత: రిజ్వాన్, బ్యానర్: రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, సహ నిర్మాత: ఖుర్షీద్ (కుషి)
సంగీతం: ఎస్ఎస్ తమన్, ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్, ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి,సాహిత్యం: కేకే