జులై 12న కళ్యాణ్ దేవ్, మాళవిక నాయర్ ‘విజేత’

“మెగాస్టార్” చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ నటించిన “విజేత” సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని క్లీన్ యు సట్టిఫికేట్ పొందింది. జులై 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.  కళ్యాణ్ దేవ్ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. రాజేష్ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమా తండ్రి కొడుకుల మధ్య నడిచే కథగా తెరకెక్కింది. విజేత ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి. మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మురళి శర్మ కళ్యాణ్ దేవ్ తండ్రి పాత్రలో నటించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈ మూవీకి కె.కె.సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి అందించారు. వారాహి చలనచిత్రం బ్యానర్ లో సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మించారు.
నటీనటులు:
కళ్యాణ్ దేవ్, మాళవిక నాయర్, తనికెళ్ళ భరణి, మురళి శర్మ, నాజర్, సత్యం రాజేష్, ప్రగతి, కళ్యాణి నటరాజన్, పృథ్వి, రాజీవ్ కనకాల, జయ ప్రకాష్ (తమిళ్), ఆదర్శ్ బాలకృష్ణ, నోయల్, కిరీటి, భద్రం, సుదర్శన్, మహేష్ విట్టా.
సాంకేతిక నిపుణులు:
కథ,స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: రాకేష్ శశి.
నిర్మాత: రజిని కొర్రపాటి,సాయి కొర్రపాటి ప్రొడక్షన్ ,ప్రెజెంటర్: సాయి శివాని
కెమెరామెన్: కె.కె.సెంథిల్,సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్,సాహిత్యం: రెహమాన్, రామజోగయ్య శాస్త్రి
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్,ఆర్ట్ డైరెక్టర్: రామకృష్ణ,స్టంట్స్: జాషువ
పీ. ఆర్.ఓ: వంశీశేఖర్.