“కంచర్ల” చిత్రయూనిట్ నూతన సంవత్సర వేడుకలు

కంచర్ల చిత్ర ఆఖరి షెడ్యూలు విశాఖపట్నం సమీపంలోని  భారీ సెట్ లో జరుగుతోంది.
తెలుగు ప్రేక్షకులకు ఉపేంద్ర గాడి అడ్డా చలనచిత్రం ద్వారా సుపరిచితం అయిన హీరో కంచర్ల ఉపేంద్ర 2 వ చిత్రం గా *కంచర్ల* ను ఫిబ్రవరి నెలలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు.
ప్రొడ్యూసర్ DR. కంచర్ల అచ్యుతరావు గారు మాట్లాడుతూ… పెద్ద సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. పూర్తి స్థాయి కుటుంబ కధ – యాక్షన్ తో ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను అల్లరిస్తుందని, ప్రముఖ ఫైట్ మాస్టర్ ‘పుష్ప’ ఫేమ్ డ్రాగన్ ప్రకాష్ గారితో ప్రస్తుతం ఫైట్స్ ను చేస్తున్నాం..ఫిబ్రవరి లో విడుదల కి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
హీరో ఉపేంద్ర బాబు మాట్లాడుతూ… ఈ చిత్రంలో మంచి పాత్ర చేస్తున్నానని, ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని తప్పక అల్లరిస్తుందని, చక్కని కధ ని ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారని అన్నారు.
చిత్ర యూనిట్ తో నూతన సంవత్సర వేడుకలను ఘనం గా నిర్వహించారు.
ఈ సినిమా కి దర్శకత్వం : యాద్ కుమార్, DOP:  గుణశేఖర్