లేడీ ఓరియెంటెడ్ మూవీ “లేతాకులు” ప్రారంభం!

ఎస్తర్ ,శృతి శరణ్ ,అవయుక్త ,వంశీ పాండ్య హీరో హీరోయిన్స్ గా .. ఎం ఆర్ చౌదరి వడ్లబట్ల సమర్పణ లో ఫ్రెష్ మూవీ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై.. వెంకటేష్ చిక్కాల నిర్మిస్తున్న “లేతాకులు” ఘనంగా ప్రారంభమైంది. ఎస్తర్ కీలకపాత్ర లో నటిస్తున్న ఈ చిత్రాన్ని చంటి గాణమని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణ మోహన రావు  క్లాప్ నివ్వగా… మోహన వడ్లపట్ల కెమెరా స్విచ్చాన్ చేశారు. తమ్ముడు సత్యం స్క్రిప్ట్ అందివ్వగా… దర్శకులు వి .సముద్ర గౌరవ దర్శకత్వం వహించారు..
వెంకటేష్ చిక్కాల మాట్లాడుతూ… చంటి గాణమని గారు చెప్పిన కథ బాగా నచ్చి సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చాను… ఇటువంటి కథ నమ్మి ఎం ఆర్ చౌదరి వడ్లపట్ల గారు కూడా ఈ సినిమా లో భాగం అయ్యారు… ఎస్తర్ మా సినిమాలో కీ రోల్ చేస్తోంది.. దసరా తర్వాత షూటింగ్ జరుగుతుందని , ముఖ్కమైన సన్నివేశాలను ఉత్తరప్రదేశ్ లో తీయనున్నట్లు తెలిపారు..
ఎం ఆర్ చౌదరి వడ్లపట్ల మాట్లాడుతూ … దర్శకులు చంటి గాణమని చెప్పిన కథ ,కథనం బాగా నచ్చాయి..క్లైమాక్స్ మాత్రం ఇండియన్ ఫిల్మ్ హిస్టరీ లో ఇప్పటివరకు ఇటువంటి కాన్పెస్ట్ రాలేదు..ఇది ముఖ్యంగా మహిళలకు బాగా నచ్చుతుంది. అన్నారు..
చంటి గాణమని మాట్లాడుతూ .. ఒకరిని బాధ పెట్టిన వారికి ఏదో శిక్ష విధించడం శిక్ష కాదు అదే బాధ వాళ్ళకి కలిగాలా చేయడమే అసలైన శిక్ష అని చెప్పే కథ ఇది ..మా సినిమా లో క్లైమాక్స్ హైలెట్ నిలుస్తుందని అన్నారు..
ఎస్తర్ మాట్లాడుతూ … దర్శకులు చంటి గాణమని చెప్పిన కథ నాకు బాగా నచ్చింది.. నేను చేసిన సినిమాలతో పోల్చితే ఈ కథ డిఫరెంట్ గా ఉంటుంది… ముఖ్యంగా ప్రతి మహిళ చూడాల్సిన సినిమా .. నా కెరీర్ లో ఈ సినిమా బెస్ట్ మూవీగా నిలుస్తుందని అన్నారు.