వేణుగోపాలచారి విడుదల చేసిన ‘తాంత్రికుడు’ టీజర్

మహేందర్ వడ్ల పట్ల, సన్నీ కునాల్, రాజేష్, అనూష, త్రివేణి  నటీ నటులుగా మహేందర్ వడ్లపట్ల స్వీయ దర్శకత్వంలో సౌమ్య వడ్ల పట్ల సమర్పణలో తెరకెక్కిన చిత్రం “తాంత్రికుడు”. మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాల్ చారి చిత్ర యూనిట్ సమక్షంలో టీజర్ ను విడుదల చేశారు
తెలంగాణ స్టేట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ చేర్మెన్ వేణుగోపాల్ చారి మాట్లాడుతూ .. వడ్లపట్ల కుటుంబం నుండి వచ్చిన రెండవ సినిమా తాంత్రికుడు. ఈ సినిమా టీజర్ బాగుంది. మహేందర్ వడ్లపట్ల అమెరికాలో ఉన్నా తెలుగు మీద మమకారంతో తీసిన ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నిర్మాత యం.ఆర్.సి వడ్లపట్ల మాట్లాడుతూ..మహేందర్ కు చిన్నప్పటి నుండి నటన అంటే చాలా ఇష్టం.తనకు యాక్టింగ్ చేయాలని ఉన్నా బిజినెస్ లో బిజీగా ఉండడంతో 2000 సంవత్సరంలో లవ్ 2020 సినిమాను నిర్మించాడు. నటన పరంగా తన డ్రీమ్ ను నెరవేర్చాలనుకున్నా ఇప్పటివరకు టైం దొరకలేదు. చివరకు మా సంఘ కుమార్ ద్వారా తన డ్రీమ్ ను ఫుల్ ఫిల్ చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే తను మరెన్నో సినిమాలు తియ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ… మా తాంత్రికుడు సినిమాకు మూల కారకుడు మా సంఘకుమార్. తను నా దగ్గరకు వచ్చి నేను ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాను. మీ బ్రదర్ ను నిర్మాతగా, దర్శకుడు గా, నటుడుగా ఇండస్ట్రీకి పరిచయం చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. తను చెప్పినట్టు ఈ సినిమాకు అన్నీ తానై చాలా సహాయ, సహకారాలు అందించాడు. మా బ్రదర్ మహేందర్ ఈ సినిమా చాలా బాగా తెరకెక్కించాడు అన్నారు.

చిత్ర దర్శక,నిర్మాత, నటుడు మహేందర్ వడ్లపట్ల మాట్లాడుతూ… మంచి సినిమా తీద్దాం అని అమెరికా నుండి వచ్చిన  నాకు మా అన్న ద్వారా సంఘకుమార్ పరిచయం అవ్వడం జరిగింది. తను ఈ సినిమాకు సపోర్ట్ చేశాడు.ఈ సినిమాకు నేను దర్శకుడు, నిర్మాతగా చెయ్యడమే కాకుండా తాంత్రికుడు పాత్రలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గోవాలో చేసిన సీన్స్ బాగా వచ్చాయి అన్నారు.

సంఘకుమార్ మాట్లాడుతూ…  మంచి అభిరుచి ఉన్న వ్యక్తి మహేందర్.తను అమెరికా నుండి వచ్చి ప్రేక్షకులకు మంచి మెసేజ్ ఇవ్వాలనే కోరికతో మంచి హార్రర్, లవ్, ఎమోషన్ ఉన్న కథను సెలెక్ట్ చేసుకొని అద్భుతమైన సినిమా తీశాడు. అయితే మోహన్ వడ్లపట్ల గారిని నేను సొంత అన్నలా భావిస్తున్నందున వారి తమ్ముడు మహేందర్ తీస్తున్న ఈ సినిమాకు ప్రొడక్షన్ పరంగా, పోస్ట్ ప్రొడక్షన్ పరంగా ఆర్టిస్ట్ ల పరంగా నా వంతు కొంత సహాయ సహకారాలు ఇవ్వడం జరిగింది అన్నారు.
ఎలైట్ మీడియా అధినేత మురళి మోహన్ వేములపల్లి మాట్లాడుతూ..మంచి కాన్సెప్ట్ తో  తీసిన తాంత్రికుడు సినిమా టీం అందరికీ ఆల్ ద బెస్ట్ అన్నారు.