నిఖిల్ ‘కిర్రాక్ పార్టీ’ మార్చ్ 16 న విడుదల

నిఖిల్ హీరోగా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరెకెక్కిన ‘కిర్రాక్ పార్టీ’ చిత్రాన్ని మార్చ్ 16 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేయనున్నారు. చిత్రం షూటింగ్ పూర్తికాగా, శరవేగంగా పోస్ట్-ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంటుంది.
ఇటీవలే విడుదలైన ‘కిర్రాక్ పార్టీ’ టీజర్ మరియు పాటలకు విశేష స్పందన వస్తుంది. నిఖిల్ స్టైలిష్ మ్యాచో లుక్స్ చిత్రంపై అంచనాలను మరింత పెంచేసాయి. కాలేజీ క్యాంపస్ డ్రామాగా వస్తుండడంతో ‘కిర్రాక్ పార్టీ’ నిఖిల్ కు ‘హ్యాపీ డేస్’ తరహా మరో భారీ విజయం అవుతుందని అంతా ఆశిస్తున్నారు.
కిర్రాక్ పార్టీ తో శరన్ కొప్పిశెట్టి దర్శకునిగా పరిచయమవుతున్నారు. నిఖిల్ తో ‘స్వామి రా రా’, ‘కార్తికేయ’ వంటి హిట్ చిత్రాలు తీసిన దర్శకులు సుధీర్ వర్మ, చందూ మొండేటి ఈ చిత్రానికి స్క్రీన్-ప్లే, మాటలు రాయడం మరో విశేషం.
సంయుక్త హెగ్డే, సిమ్రాన్ పరీన్జ నిఖిల్ సరసన హీరోయిన్ లు గా నటిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర, కిషోర్ గరికిపాటి, అజయ్ సుంకర, అభిషేక్ అగ్రవాల్ నిర్మాతలుగా ఏ.కే. ఎంటర్టైన్మెంట్స్ మరియు ఏటివి బ్యానర్ ల పై నిర్మిస్తున్న కిర్రాక్ పార్టీ మార్చ్ 16 న ప్రపంచ వ్యాప్తంగా భారీ గా విడుదల కానుంది.
సాంకేతిక వర్గం:
దర్శకత్వం- శరన్ కొప్పిశెట్టి, సంగీతం- అజనీష్ లోకనాథ్
మాటలు – చందూ మొండేటి, స్క్రీన్-ప్లే – సుధీర్ వర్మ
ఛాయాగ్రహకుడు – అద్వైత గురుమూర్తి, ఎడిటర్ – యమ్.ఆర్ వర్మా
ఆర్ట్ – అవినాష్,  కో-డైరెక్టర్ – సాయి దాసం
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కిషోర్ గరికిపాటి,  సహ నిర్మాతలు – అజయ్ సుంకర – అభిషేక్ అగర్వాల్
నిర్మాత: రామబ్రహ్మం సుంకర