నితిన్..రష్మిక ‘భీష్మ’లో అన్నీ కొత్తగా ఉంటాయి!

‘భీష్మ’ చిత్రంలోని తొలి గీతం ‘యు ట్యూబ్’ ద్వారా విడుదల అయింది. గీత రచయిత శ్రీమణి సాహిత్యానికి, సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ స్వరాలు సమకూర్చారు. గాయకుడు అనురాగ్ కులకర్ణి గాత్రంలో ప్రాణం పోసుకుందీ పాట.’సింగిల్స్ యాంధమ్’ పేరుతో విడుదలయిన ఈ గీతానికి విశేష స్పందన లభించింది.నితిన్,రష్మిక మండన,వెంకీ కుడుముల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న చిత్రం ఇది.
 
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల అయిన వీడియో దృశ్యాలు వాటిలోని..నితిన్ ‘నా లవ్ కూడా విజయ్ మాల్యా లాంటిదిరా…కన్పిస్తుంటుంది కానీ క్యాచ్ చెయ్యలేం’ అంటూ చెప్పే సంభాషణకు విశేషమైన ప్రాచుర్యం లభించింది. నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి లో విడుదల కానుంది
 
చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ …
‘సింగిల్స్ యాంధమ్’ పేరుతో విడుదల అయిన తొలిగీతంకి అద్భుతమైన స్పందన లభించింది. నితిన్,రష్మిక జంట చూడ ముచ్చటగా ఉందన్న ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇప్పటికే విడుదల అయిన చిత్రం లోని వీడియో దృశ్యాలు విపరీతంగా వైరల్ అయ్యాయి. ‘భీష్మ’ చిత్ర కధ,కధనాలు,సన్నివేశాలు,సంభాషణలు చాలా కొత్తగా ఉంటాయి. ప్రతి అబ్బాయి నితిన్ గారి క్యారెక్టర్ కి ..ప్రతి యువతి కూడా రష్మిక క్యారెక్టర్ కి కనెక్ట్ అవుతుంది. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్. వినోద ప్రధానంగా సాగుతుంది అని తెలిపారు దర్శకుడు వెంకీ కుడుముల.
నితిన్,రష్మిక మండన,నరేష్,సంపత్,రఘుబాబు,బ్రహ్మాజీ,నర్రా శ్రీనివాస్,వెన్నెల కిషోర్,అనంత నాగ్,శుభలేఖ సుధాకర్,జస్సెన్ గుప్త, సత్యన్, మైమ్ గోపి, సత్య, కల్యాణి నటరాజన్,రాజశ్రీ నాయర్,ప్రవీణ తదితరులు నటిస్తున్నారు.
 
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం(వెంకట్ ),సమర్పణ : పి.డి .వి. ప్రసాద్ ,
మ్యూజిక్ :మహతి స్వర సాగర్, డి.ఓ.పి :సాయి శ్రీరామ్, ఆర్ట్ డైరెక్టర్ :సాహి సురేష్, ఎడిటర్ :నవీన్ నూలి