నితిన్ పెళ్లి కానుక… ఈ దృశ్య మాలిక !

పెళ్లికొడుకెక్కడ…
హి ఈజ్ మై బాయ్ ఫ్రెండ్ ..
అది నా గర్ల్ ఫ్రెండ్ కాదు..
అర్జున్..ఇప్పుడున్న పరిస్థితిలో మీ ఇద్దరి ఫ్యూచర్ దృష్ట్యా ‘అను’ ని నువ్వు పెళ్లి చేసుకోవటమే నాకు న్యాయం అనిపిస్తోంది.
చెయ్ తియ్ జస్టిస్ చౌదరి…
ఏంటి మావయ్య..నీ బతుకు ఇలా అయిపొయింది…
ఏరా…ఏడుస్తున్నావా….మరి పెట్టు..
‘నాన్నా..నవ్వుతోంది …నేను కట్టలేను నాన్నా
అనే సందర్భాను సారంగా సాగే సంభాషణలతో పాటు
బస్టాండే బస్టాండే…ఇక బతుకే బస్టాండే‘ అనే సాహిత్యం తో కూడిన బీజియం తో
ఈ దృశ్య మాలిక ముగుస్తుంది.
‘ప్రేమ’ తో కూడిన కుటుంబ కదా చిత్రం ‘రంగ్ దే’.
నితిన్ వివాహమహోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని చిత్రం యూనిట్ ఈ దృశ్య మాలిక ను విడుదల చేసింది. సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు పి.సి.శ్రీరామ్ గారు ఈ చిత్రానికి ఛాయాగ్రహణ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. . 2021 సంక్రాంతి కానుకగా చిత్రం విడుదల అవుతుందన్నట్లుగా ఈ టీజర్ లో కనిపిస్తుంది..
 
నితిన్,కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ ‘రంగ్ దే’ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, వినీత్,రోహిణి, కౌసల్య,బ్రహ్మాజీ,వెన్నెల కిషోర్, సత్యం రాజేష్,అభినవ్ గోమటం,సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు.కూర్పు: నవీన్ నూలి,సమర్పణ: పి.డి.వి.ప్రసాద్, నిర్మాత:సూర్యదేవర నాగవంశీ,రచన,దర్శకత్వం: వెంకీ అట్లూరి