నోయెల్ `14`మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్

ఫిబ్రవరి 14 వేలెంటైన్స్ డే సందర్భంగా `14` చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని ‘బిగ్ బాస్’ విన్నర్ `రాహుల్ సిప్లిగంజ్` విడుదల చేశారు. రాయల్ పిక్చర్స్ పతాకంపై నోయెల్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న‌ చిత్రం `14`. లక్ష్మిశ్రీనివాస్ ద‌ర్శకత్వంలో సుబ్బారావ్ రాయన, శివకృష్ణ నిచ్చెన మెట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. వైవిద్యభరితమైన ఈ చిత్రంలో రతన్, విశాఖ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ ఆచార్య, మహేష్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
 
రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ… “ఈ మోషన్ పోస్టర్ చాలా కొత్తగా ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంది. ఈ పోస్టర్ లాగే సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది అనుకుంటున్నాను. నోయల్ కి `కుమారి 21ఎఫ్` సినిమాకన్నా ఎక్కువ పేరు రావాలని ఆశిస్తున్నాను“ అన్నారు.
 
దర్శకుడు లక్ష్మిశ్రీనివాస్ మాట్లాడుతూ – “కొత్త పాయింట్ ని ఎప్పుడు తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకంతో మీ ముందుకు వస్తున్నాం“ అన్నారు.
 
నోయెల్ సీన్, రతన్, వైశాఖ, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ ఆచార్య, మహేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సాయినాథ్, సంగీతం: ఎర్త్ సౌండ్స్, ఎడిటర్: జానకిరామ, స్టంట్స్: డ్రాగన్ ప్రకాష్, మాటలు: ఆదిత్య భార్గవ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కామిరెడ్డి బాబురెడ్డి