‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’ని నవ్వుతూ ఎంజాయ్‌ చేస్తారు!

ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. శేఖర్‌ రాజు శేఖర ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ బేనర్‌పై నిర్మిస్తున్న చిత్రం ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’. ఈ సినిమా ద్వారా రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ‘జబర్దస్త్‌, ఢీ, పోవే పోరా’ వంటి సూపర్‌హిట్‌ టెలివిజన్‌ షోస్‌ తో ఎంతో పాపులర్‌ అయిన సుడిగాలి సుధీర్‌ హీరోగా.. ‘రాజుగారి గది’ ఫేమ్‌ ధన్య బాలకృష్ణ హీరోయిన్‌గా డిసెంబర్‌ 28న విడుదలవుతున్న సందర్భంగా విలేకరుల సమావేశంలో నిర్మాత, నటుడు కె.శేఖర్‌ రాజు, దర్శకుడు రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల పాల్గొన్నారు…
నిర్మాత,నటుడు కె.శేఖర్‌ రాజు మాట్లాడుతూ…
అంచెలంచెలుగా ఎదుగుతూ…
మాది భీమవరం దగ్గర ఒక పల్లెటూరు. మధ్య తరగతి కుటుంబం.హైదరాబాద్‌లో ఓ మామూలు వ్యక్తిగా అడుగుపెట్టాను. 2500 నెలసరి జీతానికి ఓ గ్లాస్‌ స్మార్ట్‌లో పని.సైకిల్‌మీద వెళ్తూ 2005 నుండి 2008 వరకు అక్కడే ఆ పనిలోని మెళకువలు నేర్చుకుని 2008లో గీతం కాలేజీకి సంబంధించిన విండోస్‌ గ్లాసింగ్‌ కాంట్రాక్ట్‌ తో అంచెలంచెలుగా ఎదుగుతూ శేఖర గ్లాస్‌ వర్క్స్‌ను స్థాపించాను. ప్రస్తుతం మూడు చోట్ల దాదాపు 90 మంది స్టాఫ్‌. భీమవరం కళాకారులకు పుట్టినిల్లు .అనుకోకుండానే నా దృష్టి సినిమాలపై వెళ్లింది.
 
సినిమా చాలా బాగా వచ్చింది!
రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల చెప్పిన కథ నచ్చి ‘శేఖర్‌ ఆర్ట్‌ క్రియేషన్స్‌’ ప్రారంభించాను. కథ ప్రకారం సుడిగాలి సుధీర్‌ని హీరోగా పరిచయం చేస్తూ ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’ చిత్రాన్ని నిర్మించాను. ధన్య బాలకృష్ణ కథానాయిక. సుధీర్‌ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. సుధీర్‌కు డెఫినెట్‌గా ఇది మంచి సినిమా అవుతుంది. మలేషియాలోని రిచ్‌ లొకేషన్స్‌లో షూటింగ్‌ చేసాము. మా చిత్ర యూనిట్‌ సహకారం చాల ఉంది.. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ ఇయర్‌ ఎండింగ్‌లో ఆడియన్స్‌ నవ్వుతూ ఎంజాయ్‌ చేస్తారనే నమ్మకం ఉంది. ఇందులో ఒక ఫుల్‌ లెంగ్త్‌ క్యారెక్టర్‌ చేశాను. రాజశేఖర్‌రెడ్డి దర్శకత్వ శాఖలో అనుభవంతో ఒక మంచి కథ రాసుకుని.. అంత బాగా తెరకెక్కించారు. ఈ సినిమాతో తనకు దర్శకుడిగా మంచి పేరు వస్తుంది.
 
మంచి సందేశం ఉంది !
సాఫ్ట్‌ వేర్‌ బ్యాక్‌ డ్రాప్‌లో కథ నడుస్తుంది. ఫుల్‌ లెంగ్త్‌ కామెడీతో పాటు ఎమోషన్స్‌తో ..అంతర్లీనంగా మంచి సందేశం ఉంది. రైతులకు, సాప్ట్‌వేర్‌ సుధీర్‌కు ఉన్న లింక్‌ ఏంటీ? అనేది వెండితెరపై చూడాలి.ఈ సినిమాలో గద్దర్‌గారి పాత్ర ప్రేక్షకులకు నచ్చేవిధంగా .. ఆసక్తికరంగా ఉంటుంది. శివప్రసాద్‌గారు ముఖ్య పాత్రలో నటించారు. ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌ లక్ష్మణ్‌, రామ్‌ ప్రసాద్‌, గౌతం రాజు, భీమ్స్‌ ఇలా ప్రతి ఒక్కరూ పూర్తి సహకారం అందించారు.అలాగే ఈ సినిమా ప్రమోషన్స్ లో మాకు పూర్తి సహకారం అందించిన బి.ఎ రాజు గారికి ప్రత్యేక దన్యవాదాలు“అన్నారు.
 
చిత్ర దర్శకుడు రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల మాట్లాడుతూ…
 
సింగిల్‌ సిట్టింగ్‌లోనే ఓకే !
నేను రైటర్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేసి .. అందరిలాగే 10 సంవత్సరాల క్రితం స్క్రిప్ట్స్‌ పట్టుకొని అన్నీ ఆఫీస్‌లకి తిరిగాను. ఫైనల్‌గా మా గురువుగారు సంపత్‌ నంది దగ్గర చాలా సినిమాలకి అసిస్టెంట్‌ రైటర్‌, కో డైరెక్టర్‌గా పని చేశాను. అలాగే పోసానిగారి దగ్గర కొన్ని మూవీస్‌కి వర్క్‌ చేశాను. కోన వెంకట్‌గారి దగ్గర రైటర్‌గా వర్క్‌ చేశాను. రైటర్‌గా ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’ చిత్రానికి పని చేశాను. శేఖర్‌ రాజుగారికి ఈ కథ చెప్పాను. ఆయన సింగిల్‌ సిట్టింగ్‌లోనే ఓకే చేశారు.
 
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ !
ఈ సినిమా సుధీర్‌ ఫ్యాన్స్‌నీ, కామన్‌ ఆడియన్స్‌ని పక్కాగా ఎంటర్‌టైన్‌ చేస్తుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ సినిమా. కరెంట్‌ బర్నింగ్‌ ఇష్యూ మీద చేసిన పాయింట్‌. డెఫినెట్‌గా అందర్నీ ఆలోచింపజేస్తుంది. రెగ్యులర్‌ సినిమాల్లా కాకుండా కమర్షియల్‌గానే మంచి పాయింట్‌ని టచ్‌ చేస్తూ సినిమా చేశాం. సుడిగాలి సుధీర్‌ కామెడీ తో పాటు సస్పెన్స్‌తో కూడిన థ్రిల్లింగ్‌ అంశాలు ఇందులో ఉంటాయి. ఆడియన్స్‌లో ఆయన క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకొని ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’ అని టైటిల్‌ పెట్టాం.
 
గద్దర్‌ పాత్ర గుర్తుండిపోతుంది !
ఈ సినిమాలో గద్దర్‌ ఒక పాట పాడి నటించారు. సినిమా చూసి బయటికి వచ్చాక కూడా గుర్తుండిపోయే క్యారెక్టర్‌ చేసిన గద్దర్‌గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇటీవల మనకు దూరమైన డా. ఎన్‌. శివప్రసాద్‌గారు ఈ సినిమాలో మంచి క్యారెక్టర్‌ చేశారు. నాజర్‌, పోసాని కృష్ణమురళి, ఇంద్రజ, పృధ్వీ, షాయాజీ షిండే ముఖ్య పాత్రలు పోషించారు.ప్రేక్షకులు తప్పకుండా మా చిత్రాన్ని ఆదరిస్తారని నమ్ముతున్నాను“అన్నారు