రాజ్ డొక్కర ‘రా’ పోస్టర్ విడుదల

కార్తిక్ క్రియేషన్స్ సమర్పణలో.. శ్రీనివాస్, ఇర్ఫాన్, చంటి, మనోహర్, లోహిత లు ప్రధాన పాత్రలు పోషిస్తూ .. రాజ్ డొక్కర దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం ‘రా’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ , పోస్టర్ ను నూతన సంవత్సరం సందర్బంగా విడుదల చేశారు . దర్శకుడు త్రినాధ్ నక్కిన, జబర్దస్త్ అవినాష్, సతీష్ బోట్ల ముఖ్య అథితులుగా పాల్గొని ‘RAW’ (రా) పోస్టర్ విడుదల చేశారు.
 
త్రినాధ్ నక్కిన మాట్లాడుతూ.. ‘RAW’ (రా) అనే టైటిల్ కొత్తగా అనిపించింది. పోస్టర్ లో కూడా కొత్తదనం కనపడుతోంది. అయితే, సినిమాలో విషయం ఉంటేనే వర్కౌట్ అవుతుంది. దానికి బెస్ట్ కంటెంట్ చెప్పుకుంటే.. హారర్ కామెడీ లేదా లవ్ స్టోరీ ఉండాలి. అవి ఈ సినిమాలో ఉన్నాయని అర్థమవుతోంది. డైరెక్షన్, ప్రొడక్షన్ చేయడం చాలా కష్టమైన పని. ఈ రెంటిని బ్యాలెన్స్ చేయడమంటే.. సాధారణమైన విషయం కాదు. అలాంటి బాధ్యతను తీసుకున్న రాజ్ డొక్కర నిజంగా ‘గ్రేట్’ అని చెప్పాలి. టీమ్ అందరిదీ వైజాగ్ ..షూటింగ్ కూడా ఆ ప్రాంతాల్లోనే చేశారని చెబుతున్నారు. ఇక ఈ సినిమా ను చాలా ఫ్యాషనేట్ తో తీశారు. పెద్ద సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నా అన్నారు.
 
దర్శకుడు, నిర్మాత రాజ్ డొక్కర మాట్లాడుతూ.. ఇది ఒక ట్రూ స్టోరీ తో చేసుకొని చేసిన సినిమా. మా సినిమా లో RAW( రా) అంటే ఏంటి అనేది ఇంటర్వెల్ లో రివీల్ చేయడం జరుగుతుంది. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్. ఇందులో డ్రంక్ అండ్ డ్రైవ్ మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. రెండు పాటలు, రెండు ఫైట్స్ త్వరలో పూర్తి చేసి ఏప్రిల్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. 25 డేస్ లో సినిమా షూటింగ్ పూర్తి చేయగలిగాము .అని తెలిపారు.
 
ఈ కార్యక్రమంలో చంటి, మనోహర్, లోహిత,ఇర్ఫాన్, స్వీటీ, ఆజాద్ ఖాన్, సూర్య లతో పాటు తదితరులు పాల్గొని తమ అభినందనలు తెలియచేసారు.
 
చంటి, మనోహర్, లోహిత, ఇర్ఫాన్ , స్వీటీ, ఆజాద్ ఖాన్, సూర్య, వినోద్, హాడీ, నయీమ్, శ్రీనివాస్ ప్రధాన ప్రాత్రలు పోషించిన ఈ చిత్రానికి కథ- స్క్రీన్ ప్లే- మాటలు- దర్శకత్వం: రాజ్ డొక్కర, కెమెరా: రాజేష్ భూపతి, కో డైరెక్టర్: సురేష్ వాన పిల్లి, మ్యూజిక్: కె. వేద, లిరిక్స్: రామాంజనేయులు, మేకప్: గణేష్, స్టంట్స్: రాజేష్, కొరియోగ్రఫీ: గణేష్ స్వామి