మామిడాల శ్రీనివాస్ ‘స్ట్రీట్ లైట్’ ట్రైలర్ విడుదల! 

విశ్వ దర్శకత్వంలో  మామిడాల శ్రీనివాస్ నిర్మించిన చిత్రం ‘స్ట్రీట్ లైట్’. మూవీ మాక్స్ బ్యానర్ పై తాన్య దేశాయ్, అంకిత్ రాజ్,  కావ్య రెడ్డి, సీనియర్ హీరో వినోద్ కుమార్ ప్రధాన పాత్రలు చేసిన ఈ చిత్రానికి సంబందించిన లిరికల్ వీడియో సాంగ్ తో  పాటు టీజర్ విడుదల జరిగింది. దర్శకుడు జి నాగేశ్వర రెడ్డి లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేయగా, ట్రైలర్ ని ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత దామోదర్ ప్రసాద్, తుమ్మలపల్లి  రామసత్యనారాయణ, నిర్మాత మోహన్ వడ్లపట్ల తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
నిర్మాత మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ ..కరోనా అయిపోయాక సెప్టెంబర్ లో సినిమా మొదలెట్టి డిసెంబర్ వరకు పూర్తి చేసాం.. తెలుగు, హిందీ రెండు భాషల్లో ఈ సినిమాను తీసాం. దర్శకుడు విశ్వ ప్రసాద్ చాలా కష్టపడ్డారు. బిజినెస్ పరంగా కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో మెయిన్ లీడ్ తాన్యా దేశాయ్ అద్భుతంగా చేసింది. అలాగే సీనియర్ వినోద్ కుమార్, చిత్రం శ్రీను, ధన్రాజ్ ఇలా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు . తప్పకుండా ఈ సినిమాను మంచి సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను అన్నారు.
సి. కళ్యాణ్ మాట్లాడుతూ..  నిర్మాత శ్రీనివాస్ మంచి థాట్స్ తో ఈ సినిమా తీశారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ను మించిపోయారు అని చెప్పాలి. నిర్మాత శ్రీనివాస్ ఛాంబర్ మనిషిగా, ఎగ్జిబిటర్ గా చాలా మంచి నాలెడ్జ్ ఉంది. ఐతే ఈ సినిమాలో మసాలా ఎక్కువగా ఉంది. అది శృతి మించకూడదు అని నా సలహా. ఈ సినిమా విషయంలో నెట్ఫ్లిక్స్ లాంటి వేదికపైకి వెళితే చాలా మంచిది. వాళ్లకు కావలసిన కంటెంట్ ఉంది. ఇక శ్రీనివాస్ గారు యూ ఎఫ్ ఓ, క్యూబ్ లాంటి వాటికి పోటీగా వెళ్లి వాళ్లనే భయపెట్టిన వ్యక్తి. అయన చేసిన పోరాటంతో వాళ్ళు ఆయనను కలుపుకు పోయారు. అయన జన్మదినం సందర్బంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విశ్వా కూడా రామ్ గోపాల్ వర్మ ని మించే స్థాయిలో సినిమాలు చేయాలనీ ప్రయత్నం చేసినట్టున్నాడు.. అన్నారు.
తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ .. నిర్మాత మామిడాల శ్రీనివాస్ డిస్ట్రిబ్యూటర్ గా చాలా మంచి పేరున్న వ్యక్తి. అయన అంటే అందరికి అభిమానం. అందుకే పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సినిమా మంచి విజయం అందుకుని మామిడాల శ్రీనివాస్ కు డబ్బులు తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ .. నిర్మాత శ్రీనివాస్ అటు డిస్ట్రిబ్యూటర్ గా కూడా బాగా పాపులర్ అయిన వ్యక్తి. ఆయనకు ఎలా సినిమా తీయాలో బాగా తెలుసు. అప్పట్లో యూ ఎఫ్ ఓ, క్యూబ్ లాంటి వారితో పోరాటం చేసిన వ్యక్తి. అయన తీసిన ఈ సినిమా తప్పకుండా మంచి విజయం అందుకోవాలి అన్నారు.
ప్రసన్నకుమార్ మాట్లాడుతూ .. శ్రీనివాస్ అనే వ్యక్తి సురేష్ బాబు, అల్లు  అరవింద్, రమేష్ ప్రసాద్ లాంటి వారు డిజిటల్ ప్లాట్ ఫార్మ్ ని క్రియేట్ చేసిన తరువాత ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా మామిడాల శ్రీనివాస్ కూడా ఓ డిజిటల్ ప్లాట్ ఫామ్ ని క్రియేట్ చేసి వారికంటే తక్కువ రేట్స్ కు సినిమా వేస్తామని చెబితే మొదట్లో చాలా సమస్యలు వచ్చాయి. అయినా వారితో పోరాటం చేసి చివరకు వారందరు కలిసి ఆయనను కలుపుకుపోయారు. అలాంటి గట్స్ ఉన్న నిర్మాత. అయన నిర్మిస్తున్న ఈ సినిమా మంచి విజయం అందుకోవాలి. అలాగే దర్శకుడు విశ్వ గారు ప్రసాద్ పేరు తీసి నేను రామ్ గోపాల్ వర్మ లేని లోటు తీరుస్తా అనే తరహాలో వచ్చారు. ఈ సినిమాలో కాస్త మసాలా ఎక్కువగా ఉందన్న విషయం అర్థం అవుతుంది.నిర్మాతకి  బాగా డబ్బులు రావాలి అన్నారు.
దర్శకుడు జి నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ .. శ్రీనివాస్ గారు డిస్ట్రిబ్యూటర్ గా నాకు బాగా తెలుసు. జనరల్ గా చాలా సినిమాలకు రిటర్న్స్ ఎక్కువగా రావు.. కానీ నేను చేసిన ‘తెనాలి రామకృష్ణ’ సినిమాకు రిటర్న్స్ ఇచ్చిన వ్యక్తి.. అయన నిజాయితీ అక్కడ కనిపించింది. ఈ సినిమాలో కాస్త మసాలా ఎక్కువైంది అని అనిపిస్తుంది. దర్శకుడు విశ్వ ఇంతకు ముందు భార్య అనే సినిమా చేసాడు.. ఆ సినిమా ఇచ్చిన ప్లాప్ వల్ల వచ్చిన కసితో ఈ సినిమాలో మసాలా బాగా దట్టించాడు. ఈ సినిమాకు కాస్త స్టాండర్స్ మైంటైన్ చేసిఉంటే మరో రేంజ్ కి వెళ్ళేది. సినిమా సక్సెస్ అయి బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను అన్నారు.
చిత్ర దర్శకుడు విశ్వ మాట్లాడుతూ .. ఇది కచ్చితంగా మెసేజ్ ఇచ్చే సినిమా. ఇందులో కంటెంట్ అలాంటిది కాబట్టి అలా చూపించాం. పగలంతా ఎంతో పెద్దమనుషులుగా చలామణి అయ్యే చాలా మంది రాత్రి అయ్యేసరికి .. క్రిమినల్ థాట్స్, సెక్సువల్ పర్వర్షన్ ఎలా మారతాయి అన్న నేపథ్యంలో ఈ సినిమా తీసాం .. చీకట్లో జరిగే ముక్యంగా  స్ట్రీట్ లైట్ కింద జరిగే సంఘటనలతో ఈ సినిమా తెరకెక్కించాం. ఏ విధంగా తమ క్రైమ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ అమాయకుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారో అందులో ఒక యువతికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడం ‘రివెంజ్ డ్రామా’ ను ఆద్యంతం సస్పెన్స్ సడలకుండా తీర్చి దిద్దాము  అన్నారు.
హీరోయిన్ తాన్యా దేశాయ్ మాట్లాడుతూ .. మా నిర్మాత కు హ్యాపీ బర్త్ డే.. అలాగే దర్శకుడు విశ్వా గారికి థాంక్స్ చెప్పాలి. ఈ పాత్రకు నన్ను ఎంపికచేసినందుకు. ఈ సినిమా చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి అన్నారు.
ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ : రవి కుమార్, మ్యూజిక్ :విరించి, ఎడిటర్ : శివ,
ఆర్ట్ : ఎస్ శ్రీనివాస్,  ఫైట్స్ : నిఖిల్, కొరియోగ్రాఫి :పాల్ మాస్టర్.