నిఖిల్‌, బ‌న్నివాసు కాంబినేష‌న్ ’18 పేజీలు’ ప్రారంభం

అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జిఏ2 పిక్చ‌ర్స్ & సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్ లు సంయుక్త నిర్మాణం లో నిర్మాత బ‌న్ని వాసు.’18 పేజీలు’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిఖిల్‌, బ‌న్నివాసు కాంబినేష‌న్ లో ఈరోజు ఫిల్మ్‌న‌గ‌ర్ టెంపుల్ లో పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. ఈ చిత్రాన్ని ‘రంగ‌స్థ‌లం’ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ అందించిన సుకుమార్ ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. మంచి క‌మ‌ర్షియ‌ల్ పాయింట్ ని తీసుకుని మ్యూజిక‌ల్ యూత్ ఫిల్మ్ గా ‘కుమారి 21ఎఫ్’ తో ట్రెండ్ క్రియేట్ చేసిన ద‌ర్శ‌కుడు ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ మ‌రో క్రేజి చిత్రం తో మ‌న‌ముందుకు వ‌స్తున్నాడు . ఈరోజు ప్రారంభ‌మైన “18 పేజీలు” చిత్రానికి అల్లు అర‌వింద్ గారు పూజాకార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌గా, అల్లు అర్జున్ కుమార్తె బేబి అల్లు అర్హ హీరో నిఖిల్ మీద క్లాప్ నివ్వ‌గా..నిర్మాత బ‌న్నివాసు కుమార్తె బేబి హ‌న్విక‌ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.. క్రియేటివ్ ద‌ర్శ‌కుడు సుకుమార్ మెద‌టి షాట్ కి ద‌ర్శ‌క‌త్వం చేశారు. ఈ చిత్రానికి గొపి సుంద‌ర్ సంగీతాన్ని అందిస్తున్నారు.
 
జిఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ లో ఇంటిలిజెంట్ ప్రోడ్యూస‌ర్ బ‌న్నివాసు నిర్మాత‌గా గ‌తంలో వ‌చ్చిన భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌. గీతాగోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యాల్ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈరోజు అదే వూపుతో ఇప్ప‌డు అర్జున్ సుర‌వ‌రం లాంటి విజ‌యాలతో యూత్ లో క్రేజిస్టార్ గా పిలుచుకునే నిఖిల్ హీరోగా 18 పేజీలు అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.
 
సుకుమార్ ఏ సబ్జెక్ట్ ట‌చ్ చేసినా ప్రేక్ష‌కుడి అభిరుచికి ద‌గ్గ‌ర‌గా వుంటుంది. అతని శిష్యుడు ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన కుమారి 21ఎఫ్ చిత్రం ఎలాంటి ఘ‌న‌విజ‌యం సాధించింది. మ‌ళ్ళి మరొ కొత్త ట్రెండింగ్ చిత్రం తో ద‌ర్శ‌కుడు ప్ర‌తాప్ రావ‌టం… చిత్రం టైటిల్ తోనే ఆక‌ట్టుకున్నారు.
 
సంగీతం- గొపి సుంద‌ర్‌,కెమెరా- యువ‌రాజ్‌,ఆర్ట్‌- ర‌మ‌ణ వంక‌
లైన్ ప్రోడ్యూస‌ర్‌- బాబు,ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్స్‌- శ‌ర‌ణ్ రాప‌ర్తి & అశోక్ .బి,కొ-డైర‌క్ట‌ర్‌.. రాధా గోపాల్‌,ప్రోడక్ష‌న్ కంట్రోల‌ర్‌- వై. వీర‌బాబు