‘సుందరాంగుడు’ టైటిల్ సాంగ్ విడుదల చేసిన శ్రీకాంత్

లవ్ ఆండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా MSK ప్రమిదశ్రీ‌ ఫిలిమ్స్ బ్యానర్ లో కృష్ణసాయి, మౌర్యాని, ఈషా, రీతూ, సాక్షి హీరో హీరోయిన్లుగా దర్శకుడు వినయ్‌బాబు తెరకెక్కించిన చిత్రం ‘సుందరాంగుడు’. ఏవీ సుబ్బారావు సమర్పణలో బీసు చందర్‌ గౌడ్, యం.యస్.కె రాజు నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 17న  రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా ‘సుందరాంగుడు’  సినిమాలోని ‘సుందరాంగుడు నేనే- సుకుమారుడిని నేనే ‘ టైటిల్ సాంగ్ ను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు.

హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. హీరో కృష్ణసాయి నాకు ఎప్పటి నుంచో పరిచయం. ఎంతో ఇష్టంతో సుందరాంగుడు సినిమాలో నటించారు. సినిమా రష్ చూశాను చాలా క్వాలిటిగా తీశారు. నేను లాంచ్ చేసిన  ‘సుందరాంగుడు నేనే- సుకుమారుడిని నేనే ‘  టైటిల్ సాంగ్ చాలా బాగుంది. డిసెంబర్ 17 న రిలీజ్ అవుతున్న ఈ మూవీ మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నా అన్నారు..

హీరో కృష్ణ సాయి మాట్లాడుతూ.. ఈ సినిమాలో 6 పాటలు ఉన్నాయి… కృష్ణసాయి, మౌర్యాని కాంబినేషన్ లో వచ్చే సాంగ్స్, సీన్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. అంతేకాకుండా రామోజీఫిల్మ్ సిటీ, గోవాలోని అంద‌మైన‌ లొకేషన్స్ లో చిత్రీకరించిన పాటలు, కామెడీ.. సుందరాంగుడు చిత్రానికి ప్రధానాకర్షణ అని అన్నారు. సీనియర్ నటీనటులు జీవా, జూనియర్ రేలంగి, మిర్చి మాధవి, బాషా, మైయిన్ విలన్ గా అమిత్ తివారి నటించారు. ఫైట్ మాస్టర్ రామ్ సుంకర కంపోజ్ చేసిన ఫైట్స్ ఈ సినిమాలో మరో హైలైట్ అన్నారు. మా ‘కృష్ణసాయి ఇంటర్నేషనల్ చారిటబుల్‌ ట్రస్ట్‌’ తరఫున చాలామందికి సాయం చేస్తున్నాం. ఈ చిత్రం ద్వారా వచ్చే డబ్బుని ట్రస్ట్‌ కోసమే ఖర్చు చేయాలనుకుంటున్నాం.. అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఫైట్ మాస్టర్ రామ్ సుంకర,  కొరియోగ్రాఫర్ రవికృష్ణ, పలువురు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.. జీవా, భాషా, అమిత్ తివారి, జూనియర్ రేలంగి, మిర్చి మాధవి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి….మ్యూజిక్: సిద్ధబాబు, కెమెరా: వెంకట్ హనుమాన్, ఎడిటింగ్: నందమూరి హరి