కలలు కన్నాడు.. కానీ, నిలబడలేకపోయాడు!

బాలీవుడ్‌లో బంగారంలాంటి భవిష్యత్‌ ఉన్న సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ పరిశ్రమలో ‌ కొనసాగుతున్ననెపాటిజం (బంధుప్రీతి).. ‌ కారణంగా.. ఆత్మహత్యకు పాల్పడే మానసిక స్థితికి చేరాడని సోషల్‌ మీడియాలో నెటిజనులు ధ్వజమెత్తుతున్నారు.సుశాంత్‌ సింగ్‌ తనకు 50 కలలు ఉన్నట్లు ట్వీటర్‌ ద్వారా ఏడాది క్రితం తెలిపాడు. ఆ 50 కలలను ‘50 డ్రీమ్స్‌ ఆఫ్‌ మై లైఫ్‌ అండ్‌ కౌంటింగ్‌’ అని రాసి షేర్‌ చేశాడు కూడా. సుశాంత్‌ కన్న కలల్లో కొన్ని…
# ఆరు నెలల్లోనే సిక్స్‌ ప్యాక్స్‌ శరీరాన్ని పొందడం
# చూపులేని వారికి కోడింగ్‌ నేర్పించడం
# అడవిలో ఒక వారం రోజుల పాటు గడపడం
# వైదిక జ్యోతిష్య శాస్త్రాన్ని అర్థం చేసుకోవడం
# విమానాన్ని నడపడం నేర్చుకోవడం 
# ఐరన్‌ మ్యాన్‌ ట్రయథ్లాన్‌కు సిద్ధం కావడం
# ఎడమ చేతితో క్రికెట్‌ మ్యాచ్‌ ఆడటం
# మోర్సె కోడ్‌ నేర్చుకోవడం
# చిన్నారులు అంతరిక్షం గురించి తెలుసుకునేందుకు సహాయం చేయడం
# ఒక టెన్నిస్‌ ఛాంపియన్‌ పాత్రలో నటించడం
# నాలుగు క్లాప్‌ పుషప్‌లు చేయడం
# ఒక వారం పాటు చంద్రుడు, అంగాకరుడు, బృహస్పతి, శని గ్రహాలను పర్యవేక్షించడం
# ఒక బ్లూ హోల్‌లో ఈత కొట్టడం
# డబుల్‌ స్లిట్‌ ప్రయోగం చేసేందుకు ప్రయత్నించడం
# కొన్ని వేల మొక్కలు నాటడం
# ఇంజినీరింగ్‌ చదివిన ఢిల్లీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ కాలేజీని సందర్శించి స్నేహితులతో ఓ సాయంత్రం సరదాగా గడపడం
# ఇస్రో లేదా నాసా వర్క్‌షాపులకు వంద మంది పిల్లల్ని పంపించడం.
# కైలాశ్‌ పర్వతంపై ధ్యానం చేయడం
# ఒక పుస్తకం రాయడం
# యూరోపియన్‌ న్యూక్లియర్‌ రీసెర్చి సంస్థ అయిన సీఈఆర్‌ఎన్‌ను సందర్శించడం
 # డిస్నీలాండ్‌కి వెళ్లడం
# అమెరికాలోని లిగోని సందర్శించడం
# ఒక గుర్రాన్ని పెంచుకోవడం
# కనీసం పది రకాల నృత్యాలను నేర్చుకోవడం
# లాంబోర్గిని కారును సొంతం చేసుకోవడం
# సైమాటిక్స్‌ ప్రయోగాలు చేయడం
# భారత సైన్యంలో చేరేలా విద్యార్థులు సిద్ధమయ్యేందుకు సహాయం చేయడం
# సముద్ర అలలపై సర్ఫింగ్‌ చేయడం
# యూరప్‌ మొత్తం రైలులో ప్రయాణించడం 
# ఉచిత విద్య కోసం కృషి చేయడం. ‘సుశాంత్‌ ఫర్‌ ఎడ్యుకేషన్’‌ పేరిట ఆయన విద్యార్థులకు సహాయం కూడా చేసేవారు.
# అండ్రొమేడా అనే పాలపుంతను ఒక శక్తివంతమైన టెలిస్కోప్‌ సాయంతో పరిశీలించడం
# మంచుతో నిండిపోయిన అంటార్కిటికా ఖండాన్ని సందర్శించడం
# మహిళలు స్వీయ రక్షణ నైపుణ్యాలు నేర్చుకునేలా సహాయం చేయడం
# వ్యవసాయం నేర్చుకోవడం
# పిల్లలకు డ్యాన్స్‌ నేర్పించడం
# రెండు చేతులతో బాణాలు వేసేలా శిక్షణ పొందడం
# తనకు ఇష్టమైన 50 పాటలకు గిటార్‌ నేర్చుకోవడం
# ఒక ఛాంపియన్‌తో చెస్‌ ఆడటం
 … విమానాన్ని నడపడం నేర్చుకోవడం, ఐరన్‌ మ్యాన్‌ ట్రయథ్లాన్‌కు సిద్ధం కావడం, ఎడమ చేతితో క్రికెట్‌ మ్యాచ్‌ ఆడటం, యూరోపియన్‌ న్యూక్లియర్‌ రీసెర్చి సంస్థ అయిన సీఈఆర్‌ఎన్‌ను సందర్శించడం, ఢిల్లీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ కాలేజీని సందర్శించడం, బ్లూ హోల్‌లో ఈత కొట్టడం, సెనోట్‌లో ఈదడం (సున్నపురాయి భూమి కుంగిపోవడంతో సహజంగా ఏర్పడిన నీటి కొలను), డిస్నీల్యాండ్‌కి వెళ్లడం, అండ్రొమేడా అనే పాలపుంతను ఒక శక్తివంతమైన టెలిస్కోప్‌ సాయంతో పరిశీలించడం, రెండు చేతులతో బాణాలు వేసేలా శిక్షణ పొందడం,ప్రకంపనలకు సంబంధించి సైమాటిక్స్‌ ప్రయోగాలు చేయడం… మొదలైన సుశాంత్‌ కలలు మాత్రం నేరవేరాయి.