‘తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ ట్రస్ట్’ ఏర్పాటు !

“తెలుగు చలన చిత్ర దర్శకుల దినోత్సవం” మే4 వ తేదీన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గారు ‘తెలుగు చలన చిత్ర దర్శకుల సంక్షేమం కోసం ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేసుకుందాం’ అని తీర్మానించారు ..తద్వారా సంఘ సభ్యులలో ఆర్థికం గా ఇబ్బందుల్లో వున్నవారికి ఆరోగ్య , విద్య మరియు కుటుంబ అవసరాలకి సహాయం చేసే విధం గా ఒక నిధి ని ఏర్పాటు చేసుకుని ,తద్వారా వచ్చే వడ్డీ తో అర్హులైన వారికి తోడ్పాటు ఇద్దాం అని చెప్పారు.
ముందుగా దర్శకులు రాజమౌళి 50 లక్షలు భూరి విరాళం అందించారు ,రాఘవేంద్ర రావు గారు 10 లక్షలు ,అర్క మీడియా వారు 15 లక్షలు విరాళం ప్రకటించారు .ముఖ్య అతిధి గా విచ్చేసిన మెగా స్టార్ చిరంజీవి గారు ట్రస్ట్ ఆలోచనని మెచ్చి ,పెద్ద హృదయం తో 25 లక్షలు ప్రకటించారు .
ప్రస్తుత దర్శకుల సంఘ ప్యానెల్ సత్సంకల్పం ,మిగతా అందరి దర్శకుల సహాయ , సహకారాలతో 24/7/2019 ట్రస్ట్ ని రిజిస్టర్ చేయడం జరిగింది .
తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ ట్రస్ట్ పేరిట రాఘవేంద్ర రావు చైర్మన్ గా
N శంకర్ (మేనేజింగ్ ట్రస్టీ)
వి వి వినాయక్, సుకుమార్, బోయపాటి శ్రీను, సురేందర్ రెడ్డి
హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి మెహెర్ రమేష్ (ట్రెజరర్)
కొరటాల శివ, నందిని రెడ్డి, రాంప్ర‌సాద్‌,కాశీ,బి.వి.ఎస్‌.ర‌వి
ట్రస్టీలు గా TFDT ఆవిర్భావం జరిగింది .
 
విరాళాల సేకరణ ,సహాయ నిధి ని త్రికరణ శుద్ధిగా సభ్యుల అత్యవసర అవసరాలకి అందించే విధంగా TFDT ని ముందుకు తీసుకు వెళ్లాలనే ధృడ సంకల్పం తో ట్రస్ట్ సభ్యులు ఉన్నారు . TFDA కి మరింత మెరుగైన భవనం ,లైబ్రరీ ,ఫంక్షన్ హాల్ , దర్సకత్వ శాఖ లో ప్రావీణ్య తరగతులు , ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి తేవడానికి తెలంగాణ ప్రభుత్వ సహాయ సహకారాలు కోరుకుంటుంది.ఈ సందర్భంగా శ్రీ KTR గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు.