విజయ్ ‘విజిల్’ దీపావ‌ళికి 25న విడుదల!

హీరో విజ‌య్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్న చిత్రం `బిగిల్‌`. ‘పోలీస్‌'(తెరి), ‘అదిరింది'(మెర్స‌ల్‌) బ్లాక్ బ‌స్టర్ చిత్రాల కాంబినేషన్ విజ‌య్ హీరోగా అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో చేసిన ఎమోష‌న‌ల్ స్పోర్ట్స్ డ్రామా `బిగిల్‌`. న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఏజీయ‌స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై క‌ల్పాతి ఎస్‌.అఘోరాం, కల్పాతి ఎస్‌.గ‌ణేశ్‌, క‌ల్పాతి ఎస్‌.సురేశ్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు లో `విజిల్‌`గా ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేశ్ కోనేరు అందిస్తున్నారు. లేడీస్ ఫుట్‌బాల్ క్రీడ‌ను ఆధారంగా చేసుకుని డైరెక్ట‌ర్ అట్లీ తెర‌కెక్కించ‌గా.. రాజ‌ప్ప అనే మాస్ క్యారెక్ట‌ర్‌తో పాటు.. యంగ్ లుక్‌లోని మైకేల్ అనే ఫుట్‌బాల్ కోచ్ పాత్ర‌లో విజ‌య్ న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. న‌య‌న‌తార గ్లామ‌ర్ సినిమాకు ప్ల‌స్.
ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్షన్స్ అధినేత మ‌హేశ్ కొనేరు మాట్లాడుతూ – “త‌మిళంలోని అగ్ర క‌థానాయ‌కుల్లో విజ‌య్ ఒక‌రు. ఆయ‌న అట్లీ ద‌ర్వ‌క‌త్వంలో వ‌చ్చిన హ్యాట్రిక్ చిత్ర‌మిది. భారీ అంచ‌నాలున్నాయి. ఈ సినిమా హ‌క్కుల కోసం ఎంతో మంది పోటీ ప‌డ‌గా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్ష‌న్స్ సంస్థ ఫ్యాన్సీ రేటుతో తెలుగు విడుద‌ల హ‌క్కుల‌ను సొంతం చేసుకుంది. మాకు అవ‌కాశం ఇచ్చిన హీరో విజ‌య్‌గారికి, నిర్మాత‌ల‌కు థ్యాంక్స్‌.దీపావ‌ళి సంద‌ర్బంగా 25న విడుద‌ల కానుంది“ అన్నారు.
విజ‌య్‌, న‌య‌న‌తార‌, జాకీష్రాఫ్‌, వివేక్‌, క‌దిర్‌, యోగిబాబు, దేవ‌ద‌ర్శిని త‌దిత‌రులు నటించిన ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే: అట్లీ, ర‌మ‌ణ గిరివాస‌న్‌, మ్యూజిక్‌: ఎ.ఆర్‌.రెహ‌మాన్‌,కెమెరా: జి.కె.విష్ణు
మాట‌లు: శ‌్రీరామ‌కృష్ణ‌, క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్‌:అర‌్చ‌న క‌ల్పాతి