ప్రతి ఫ్రేంలో భారీతనంతో థ్రిల్ చేసే ‘జై భజరంగి’

కన్నడ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న డా.శివరాజ్ కుమార్  నటించిన ‘భజరంగి’  కర్ణాటక లో బాక్స్ ఆఫీస్ వద్ద సంచలం సృష్టించింది. ఆ చిత్రానికి కొనసాగింపుగా కన్నడలో ‘భజరంగి 2’ తెలుగులో ‘జై భజరంగి’ గా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో విడుదల అవుతుంది. ‘బాహుబలి’, ‘కె.జి.యఫ్’ సినిమాల స్థాయిలో వస్తున్న అద్భుత భారీ చిత్రం ‘జై భజరంగి 2’. అక్టోబర్ 29న విడుదల అవుతుంది.  ఈ చిత్రానికి సంభందించిన థియేట్రీకల్ ట్రైలర్ విడుదల చేసారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి టి. ప్రసన్న కుమార్, నిర్మాత, పంపిణి దారుడు కరుణాకర్ రెడ్డి, రాము, మార్కెటింగ్ ప్రొడ్యూసర్ బాలు పాల్గొన్నారు.

ప్రసన్న కుమార్ మాట్లాడుతూ… “కన్నడ పరిశ్రమలో సూపర్ స్టార్ అయిన రాజ్ కుమార్ నటించిన జై భజరంగి ట్రైలర్  ఏ స్థాయిలో ఉందొ నేను చెప్పాల్సిన అవసరం లేదు బాహుబలి , కె జి ఎఫ్ రేంజ్ లో ఆ సినిమాల తరువాత  మన సౌత్ లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఇది. చంద్రముఖి, అరుందతి, వంటి చిత్రాలలో వుండే థ్రిల్లింగ్ ఈ సినిమాలో వుంది. ఇందులో ఏ ఫ్రేమ్ చూసిన భారీతనం ఉట్టిపడుతుంది.  ట్రైలర్ చూస్తుంటే పూర్తి సినిమా ఎప్పుడు చూద్దామా అనిపిస్తుంది.  తప్పని సరిగా మన తెలుగు వారికి నచ్చే సినిమా అవుతుంది.” అన్నారు.

నిర్మాత నిరంజన్ పన్సారి మాట్లాడుతూ… ” ఏడు నెలలక్రితం  భజరంగి2 కి సంబందించిన టీజర్ చూసాను. ఇంత భారీగా నిర్మించిన చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు కూడా తప్పని సరిగా ఆదరిస్తారని … గత 30 ఏళ్లుగా వీడియో రంగంలో వున్న మా సంస్థ  ‘శ్రీ  బాలాజీ వీడియో’ ఒక మంచి చిత్రంతో నిర్మాణ రంగం లోకి ఎంటర్ అవ్వాలని  ‘జై భజరంగి’ తో శ్రీకారం చుట్టాము. ఈ చిత్రం మున్ముందు కూడా ఓటిటి లో విడుదలకాదు. కేవలం థియేటర్లలో మాత్రమే విడుదల అవుతుంది. విజువల్ వండర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం థియేటర్లలో మాత్రమే చూడాలి” అన్నారు.

డా. శివరాజ్ కుమార్, భావన మీనన్, శృతి, సౌరవ్ లోకేష్, శివరాజ్ కె ఆర్ పెటే  ఇందులో నటీనటులు.
సంగీతం : అర్జున్ జన్య, సినిమాటోగ్రఫర్: స్వామి జె. గౌడ, ఎడిటర్: దీపు యస్ కుమార్,
ఫైట్స్:డా. రవి వర్మ, విక్రమ్ మోర్, ఆర్ట్ డైరెక్టర్: రవి శాంతే హక్కులూ, కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: ఏ. హర్ష